Rakul Preet Singh: దయచేసి వెంటనే బ్లాక్ చేయండి!- రకుల్
Rakul Preet Singh (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Rakul Preet Singh: మొన్న శ్రియా, నేడు రకుల్.. దయచేసి వెంటనే బ్లాక్ చేయండి!

Rakul Preet Singh: సాంకేతికత పెరిగే కొద్దీ సైబర్ మోసాల పద్ధతులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పేర్లను ఉపయోగించి సామాన్య ప్రజలను మోసం చేయడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణమైపోయింది. ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోలు, సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు సృష్టించడం బాగా ఎక్కువైంది. ఈ సైబర్ నేరగాళ్ల బారిన తాజాగా ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ (Rakul Preet Singh) సింగ్ పడ్డారు. ఈ మోసగాళ్లు రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో ఫేక్ వాట్సాప్ (Fake Whatsapp) అకౌంట్‌ను సృష్టించి, దాని ద్వారా సందేశాలు పంపుతూ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ఆమె దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే స్పందించిన రకుల్, తన అభిమానులు మరియు ప్రజలను అప్రమత్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు.

దయచేసి ఆ నంబర్‌ను బ్లాక్ చేయండి

ఆమె తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేస్తూ.. ‘‘ఎవరో నా పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి, దాని ద్వారా మెసేజ్‌లు పంపి మోసం చేయాలని చూస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. అది నా అకౌంట్ కాదు అని తెలియజేస్తున్నాను. ఈ ఫేక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దు. దయచేసి ఆ నంబర్‌ను వెంటనే బ్లాక్ చేయాలని కోరుతున్నాను’’ అని స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన దృష్టికి రాగానే, స్పందించి అందరినీ అలెర్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read- IBomma Ravi Investigation: ఆధారాలు ముందు పెట్టినా.. పోలీసులకు పనికి వచ్చే ఎలాంటి సమాచారం రవి ఇవ్వలేదా?

సెలబ్రిటీల పేర్లతో పెరుగుతున్న మోసాలు

ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఫేక్ ఐడీల ద్వారా మోసపోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నటి అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) కూడా తన పేరు మీద నకిలీ ఐడీలు ఉన్నాయని హెచ్చరించారు. అలాగే, ప్రముఖ నటి శ్రియా శరణ్ (Shriya Saran) పేరుతో వాట్సాప్ అకౌంట్ వైరల్ అయిన నేపథ్యంలో, స్వయంగా ఆమె రంగంలోకి దిగి, ఆ అకౌంట్ తనది కాదని, ఎవరూ మోసపోవద్దని వివరణ ఇచ్చారు. ఈ కోవలోనే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సైబర్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా తప్పుడు వీడియోలు సృష్టించడం, అలాగే సెలబ్రిటీల ఫొటోలను ఉపయోగించి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడం పెరిగింది. ఈ నకిలీ అకౌంట్ల ద్వారా ఆర్థిక మోసాలు, వ్యక్తిగత సమాచారం తస్కరించడం వంటివి జరుగుతుంటాయి.

Also Read- Nikhil Swayambhu: ఎట్టకేలకు ‘స్వయంభు’ విడుదల తేదీ ఫిక్స్.. మేకింగ్ గ్లింప్స్ చూశారా?

అధికారుల హెచ్చరిక

సైబర్ క్రైమ్ నిపుణులు, పోలీసులు ఈ విషయంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. వారు ఉదాహరణలతో సహా.. ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సెలబ్రిటీల పేరుతో వచ్చే అనధికారిక మెసేజ్‌లు లేదా అకౌంట్ల విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏ నటి లేదా నటుడైనా వ్యక్తిగత వాట్సాప్ ద్వారా డబ్బు అడగడం లేదా వ్యక్తిగత వివరాలు అడగడం జరగదని, అలాంటి మెసేజ్‌లు వస్తే వెంటనే వాటిని బ్లాక్ చేసి, సైబర్ పోలీసులకు రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయబోతున్నారా?.. ఆ నిర్మాత ఏం చెప్పాడు అంటే?

Jogulamba Gadwal: ఆ గ్రామాభివృద్ధికి 22 హామీలు.. చర్చనీయాంశంగా మారిన బాండు పత్రం!

Kavitha: జాగృతి యాత్రలో కీలక మార్పులు.. సర్పంచ్ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్!

Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దేశ స్థాయి గుర్తింపు!