Coolie Day 1 collections: రజినీకాంత్, నాగార్జున కాంబోలో వచ్చిన కూలీ సినిమా ఆగస్టు 14న విడుదలయ్యి మిక్స్‌డ్ టాక్ తో రన్ అవుతుంది. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున (విలన్ పాత్రలో), అమీర్ ఖాన్ (స్పెషల్ క్యామియో), ఉపేంద్ర, శృతి హాసన్, పూజా హెగ్డే (స్పెషల్ సాంగ్), సౌబిన్ షాహిర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలగా నిలిచాయి.
Also Read: Watch Video: క్లాస్ రూమ్‌లో విషాదం.. ఫ్రెండ్స్ కళ్లెదుటే మరణించిన విద్యార్థి.. వీడియో వైరల్!
‘కూలీ’ ఒక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్. దేవా (రజనీకాంత్), రాజశేఖర్ (సత్యరాజ్) స్నేహితులు. రాజశేఖర్ తయారు చేసిన ఒక ప్రత్యేక కుర్చీ చుట్టూ కథ సాగుతుంది. ఈ కుర్చీని సైమన్ (నాగార్జున) సహా ఇతరులు కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు ప్రీతి (శృతి హాసన్) ఆపదలో చిక్కుకుంటుంది. స్నేహితుడి కూతురిని కాపాడేందుకు దేవా రంగంలోకి దిగుతాడు. ఈ కథలో దేవా, సైమన్ మధ్య యుద్ధం, ట్విస్టులతో సినిమా సాగుతుంది. సినిమా రిలీజ్ కు ముందే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకెళ్లింది. సినిమాలో రజనీకాంత్ పవర్ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. రిలీజ్ కు ముందే ఈ చిత్రానికి భారీ హైప్ రావడంతో ప్లస్ అయింది. అలాగే , హాలిడేస్ ఉండటంతో బుకింగ్స్ కూడా అదిరిపోతున్నాయి. కూలీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కొత్త రికార్డ్ క్రియోట్ చేసింది. రూ. 80 కోట్ల గ్రాస్ దాటేసింది.
తాజాగా బాక్సాఫీస్ లెక్కల ప్రకారం కూలీ మూవీ మొదటి రోజే దుమ్ము దులిపేసింది. ఒక్క తమిళ్ లోనే 60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాల వారి నుంచి సమాచారం. తెలుగులో రూ. 10 కోట్లు, హిందీలో రూ. 6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 5 కోట్లు, మిగతావి ఓవర్సీస్ నుంచి వచ్చినట్టు సమాచారం. ఇక యూఎస్ లో అయితే, కూలీ అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే కూలీ మూవీ అమెరికాలో 3 మిలియన్ డాలర్స్ ని దాటేసింది.అంటే రూ. 25 కోట్లకు పైగా గ్రాస్ వచ్చేసింది.
Also Read: Highest Stray Dogs State: దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
కూలీ సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే నే మొత్తం రూ. 151 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇదే నిజమైతే తమిళ్ సినిమాల్లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా కూలీ నిలవనుంది. అయితే, ఈ కలెక్షన్స్ పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి, లాంగ్ రన్ లో కూలీ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి.