Comedian Ali ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Comedian Ali: రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై అలీ రియాక్షన్.. ఆయన వేరే మూడ్ లో ఉన్నారు..

Comedian Ali: ఈ మధ్య కాలంలో సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ వివాదాల్లో నిలుస్తున్న విషయం సంగతి తెలిసిందే. అయితే, తాజాగా డైరెక్టర్ ఎస్‍వీ కృష్ణారెడ్డి బర్త్డే ఈవెంట్ లో కమెడియన్ అలీపై అసభ్య పదజాలంతో పిలిచి నోరు పారేసుకున్నారు. ఇప్పటికే, దీనిపై రాజేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను.. మీరు దాన్ని కూడా తప్పుగా తీసుకుంటే ఎలా?
అయిన నేనెప్పుడూ ఇలానే సరదాగా ఉంటాను.. నా మాట తీరు కూడా అలాగే ఉంటుంది. అది కూడా మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మీ ఖర్మ అని తేల్చి చెప్పేశారు. తాజాగా ఈ వివాదం పై అలీ రియాక్ట్ అయి వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also Read: Glenn Maxwell: సంచలన నిర్ణయం తీసుకున్న గ్లెన్ మాక్స్‌వెల్.. వ‌న్డేల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఆల్‌రౌండ‌ర్‌

కమెడియన్ అలీ మాట్లాడుతూ ” అందరికీ నమస్కారం అండి.. నిన్న జరిగిన బర్త్ డే ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ అనుకోకుండా మాట జారారు. దీన్ని తీసుకుని మీడియా మిత్రులు రక రకాలుగా రాస్తూ వైరల్ చేస్తున్నారు. ఆయన అలాంటి వాడు కాదు. మంచి నటుడు. ఆయన గురించి మీకు కూడా తెలుసు. అలాగే ఆయన ఇంట్లో ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలిసిందే.. ఆయన పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఆయన కూతురు లేరన్న బాధలో ఉన్నారు. అమ్మ లాంటి బిడ్డ లేకపోయేసరికి మరింత క్రుంగి పోయారు. కావాలని అలా చేసింది కాదు. దీన్ని మళ్లీ వైరల్ చేయకండి. ఆయన పెద్దాయన ప్లీజ్ వదిలేయండి అంటూ ” అందర్ని రిక్వెస్ట్ చేశారు.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది