Shashtipoorthi: నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), అర్చన (Archana)ల ‘షష్టి పూర్తి’కి సమయం ఆసన్నమైంది. అదేంటి, వారికి ‘షష్టి పూర్తి’ ఏంటి? అని అనుకుంటున్నారా? అందులోనూ కుమార్తెను కోల్పోయి బాధలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు ‘షష్టి పూర్తి’ చేసుకోవడం ఏంటి? మధ్యలో అర్చన ఎవరు? వంటి ప్రశ్నలు మైండ్‌లోకి వస్తున్నాయి కదా. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు, రియల్ లైఫ్‌లో. ‘లేడీస్ టైలర్’ తర్వాత దాదాపు 38 ఏళ్ల తర్వాత రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి అర్చన కలిసి నటించిన చిత్రం పేరు ‘షష్టి పూర్తి’. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా ఫిక్స్ చేశారు.
Also Read- AP Govt Jobs: సీఎం చంద్రబాబు తీపికబురు.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరపడండి..
రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్, అర్చన కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం ద్వారా పవన్ ప్రభ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘మేస్ట్రో’ ఇళయరాజా చాలా ఏళ్ల తర్వాత ఒక తెలుగు సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ రావడం, మీడియాతో ముచ్చటించడంతో ఈ సినిమాపై అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో ఏదో విశేషం ఉంది, అందుకే ఇళయరాజా కూడా రంగంలోకి దిగారనేలా టాక్ వినబడింది. (Shashtipoorthi Release Date)
చిత్ర విడుదల సందర్భంగా దర్శక నిర్మాతలు పవన్ ప్రభ , రూపేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఎందరో హేమాహేమీలు పని చేశారు. అభినయంలో ఆరితేరిన నటకిరీటీ రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి అర్చన ఈ సినిమాకు మెయిన్ అస్సెట్. ఇళయరాజా ఇచ్చిన స్వరాలతో మా చిత్రానికి ప్రేక్షకుల్లో గొప్ప అటెన్షన్ వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలూ చార్ట్‌బస్టర్స్ లిస్ట్‌లోకి చేరాయి. మళ్లీ విoటేజ్ ఇళయరాజాను వింటున్నామని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా ఉంది.
Also Read- Duvvada Srinivas: వైఎస్ జగన్ వద్దు బాబోయ్.. పార్టీ మారిపోతున్న దువ్వాడ!
‘ఏదో ఏ జన్మలోదో ..’ పాటకు సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ కీరవాణి సాహిత్యం అందించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. రెహమాన్ రచించిన ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె‘ పాటను ఎస్పీ చరణ్, విభావరి ఆలపించారు. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఈ పాటలతోనే మా సినిమా ప్రేక్షకుల్లోనే కాకుండా, బిజినెస్ సర్కిల్స్‌లో కూడా స్పెషల్ అటెన్షన్ పొందుతుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా అవుట్ పుట్ కూడా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఈ సమ్మర్‌కి మంచి ఫీల్ గుడ్ మూవీతో వీడ్కోలు చెబుతామని నమ్మకంగా చెప్పగలం. మిగిలిన 3 పాటలను, ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేస్తాం. ప్రమోషన్స్‌తో కూడా వినూత్నంగా ప్లాన్ చేశామని తెలిపారు. ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలలో నటిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు