Raj Tarun: రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’ (Paanch Minar). గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ మంచి స్పందనను రాబట్టుకోగా, ఆదివారం డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా మేకర్స్ టీజర్‌ని విడుదల చేశారు.
టీజర్ విడుదల అనంతరం డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘పాంచ్ మినార్’ టైటిల్ చాలా బాగుంది. గోవిందరాజు చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఎలాగైనా సాధించాలి, నిలబడాలనే కసి, పట్టుదలతో ఈ సినిమాని తీశారు. కెమెరా వర్క్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. సినిమాని చాలా రిచ్‌గా తీశారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. డెఫినెట్‌గా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా రాజ్ తరుణ్‌కి బెస్ట్ స్టార్ట్ అవుతుందని నమ్ముతున్నాను. టీజర్ చూడగానే సినిమా హిట్ అవుతుందనే ఫీలింగ్ కలిగింది. చిన్న బడ్జెట్‌లో క్వాలిటీ ప్రొడక్ట్ తీయడం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. అలాంటి కష్టం ఈ సినిమాకి పడ్డారు. ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాలు ఎంకరేజ్ చేయాలని అన్నారు.
Also Read- Good Bad Ugly: బ్లాక్ బస్టర్ సంభవంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్
నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న రామ్‌కి అభినందనలు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ఇందులో మంచి పాట రాశారు. హీరోయిన్ రాశి సింగ్ తెలుగు నేర్చుకొని చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఈ ఈవెంట్ చూస్తుంటే చాలా పాజిటివ్‌గా ఉంది. రాజ్ తరుణ్ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ సినిమాతో స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్ అనే టైటిల్ ఇవ్వాలని ఇండస్ట్రీలోని నిర్మాతల్ని కోరుతున్నాను. తనది నేచురల్ టైమింగ్. తనకి ఇక్కడి నుంచి అన్ని మంచి శుభాలే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Anna Konidela: పద్మావతి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన అన్నా.. ఫొటోలు వైరల్
మారుతి నా మొదటి సినిమా తర్వాత ఇప్పటివరకు నన్ను నమ్మి ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆయనకి కృతజ్ఞతలు. ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైనందుకు హ్యాపీ. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని చెప్పడానికి కారణం మా డైరెక్టర్ కష్టం, విజన్. నిర్మాతలు ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. రాశి అమేజింగ్ యాక్టర్. అనంత శ్రీరామ్ ఈ సినిమాలో చాలా చక్కని పాట రాశారు. బ్రహ్మాజీతో కలిసి యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఆయనతో నటించిన ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. శేఖర్ చంద్ర ఎప్పట్లాగే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. మా సినిమాని థియేటర్స్‌కి వచ్చి చూడండి. దయచేసి పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దని అన్నారు హీరో రాజ్ తరుణ్. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు