Rahul Sipligunj (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ అంతమంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడా.. లిస్ట్ లో ఆమె కూడా?

Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎట్టకేలకు బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పి, హరిణ్యా రెడ్డితో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ షాకింగ్ వార్తతో నెటిజన్లు అవాక్కయ్యారు.

“రాహుల్ సడెన్ గా ఇంత పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడేంటి?” అంటూ ఆశ్చర్యపోతూ, ఒకవైపు కంగ్రాట్స్ చెబుతునే ఇంకోవైపు షాక్ అవుతున్నారు. అయితే, ఇదే క్రమంలో రాహుల్‌కు సంబంధించిన కొన్ని రూమర్లు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటంటే… రాహుల్ గతంలో చాలామంది అమ్మాయిలతో డేటింగ్‌ చేశాడు. అయితే, ఎవరెవరితో రాహుల్‌కు లవ్ రూమర్స్ వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం..

బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్‌తో నటి పునర్నవి రొమాన్స్ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు, కానీ తర్వాత తెలిసింది. అది కేవలం షో రేటింగ్స్ కోసమేనని తెలిసింది. ఆ తర్వాత, అషు రెడ్డితో రాహుల్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి, వీరిద్దరూ కూడా ప్రేమలో ఉన్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక బిగ్ బాస్ 7 సమయంలో రాహుల్‌తో రతికా రోజ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేశాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, కానీ చిన్న చిన్న గొడవల కారణంగా బ్రేకప్ అయ్యారని రూమర్స్ వచ్చాయి. అయితే, ఈ ఫోటోలు సింపతీ కోసం వైరల్ చేయించారని రాహుల్ స్పష్టం చేశారు. ఇలా, పునర్నవి, అషు రెడ్డి, రతికా రోజ్‌లతో రాహుల్‌కు లవ్ రూమర్స్ వచ్చినప్పటికీ, ఫైనల్‌గా హరిణ్యా రెడ్డిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ జోడికి ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!