Prudhvi | విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. మేము సినిమాలో ఓ సీన్ చేస్తున్నప్పుడు అక్కడ 151 గొర్రెలు ఉండేవని.. కానీ తర్వాత చూస్తే అక్కడ 11 మాత్రమే ఉన్నాయంటూ కామెంట్ చేశాడు. అది కాస్త పెద్ద రచ్చుకు దారి తీసింది. పృథ్వీ కావాలనే వైసీపీని ట్రోల్ చేశాడంటూ ఆ పార్టీ కేడర్ సీరియస్ అయింది. విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ (Prudhvi) చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. మేము సినిమాలో ఓ సీన్ చేస్తున్నప్పుడు అక్కడ 151 గొర్రెలు ఉండేవని.. కానీ తర్వాత చూస్తే అక్కడ 11 మాత్రమే ఉన్నాయంటూ కామెంట్ చేశాడు. అది కాస్త పెద్ద రచ్చుకు దారి తీసింది. పృథ్వీ కావాలనే వైసీపీని ట్రోల్ చేశాడంటూ ఆ పార్టీ కేడర్ సీరియస్ అయింది. దీంతో లైలా సినిమాను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి.
దీనిపై తాజాగా విశ్వక్ సేన్ కూడా రియాక్ట్ అయ్యాడు. పృథ్వీ చేసిన కామెంట్లకు తమకు సంబంధం లేదన్నాడు. అది అతని వ్యక్తిగతం అని.. దానికి సినిమాను బ్యాన్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మాట్లాడాడు విశ్వక్. అంతే కాకుండా పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కూడా చెప్పాడు. రిలీజ్ రోజునే హెచ్ డీ ప్రింట్ రిలీజ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని.. తాను ఎవరికీ అన్యాయం చేయలేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు విశ్వక్. తన సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దంటూ వేడుకున్నాడు. అవును విశ్వక్ చెప్పింది నిజమే కదా అంటున్నారు సగటు ప్రేక్షకులు. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన కామెంట్స్ కు సినిమా యూనిట్ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. కావాలంటే పృథ్వీని అనాలి గానీ.. అసలు పృథ్వీ వ్యాఖ్యలతో సంబంధం లేని సినిమాను టార్గెట్ చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సినిమాను నెలల పాటు కష్టపడి కోట్లు ఖర్చుపెట్టి తీస్తారు. ఎవరో ఒకరు ఏదో అన్నారని ఇలా సినిమాలను టార్గెట్ చేసుకుంటూ పోతే అసలు సినిమాలు తీయడానికి కూడా వెనకాడాల్సి వస్తుందని చెబుతున్నారు.