BOLA-SANKAR( IMAGE :X)
ఎంటర్‌టైన్మెంట్

Anil Sunkara: ఆ సమయంలో అన్నయ్య సాయం చేస్తే.. అయ్యగారు మాత్రం!

Anil Sunkara: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీనిపై ఆ సినిమా నిర్మాత అనిల్ సుంకర స్పందిస్తూ ఇలా చెప్పుకొచ్చారు.. ‘అజిత్ వేదాళం సినిమాకు రిమేక్ గా ‘భోళా శంకర్’ తీయాలనుకున్నాం. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కరోనా లేదు తర్వాత కరోనా రావడంతో అందరూ ఆ సినిమా చూసేశారు. అందుకే ఆ సినిమా ఆడలేదు. ఆ సమయంలో చాలా బాధపడాల్సి వచ్చింది. మూడు రోజులు ఎవరికీ కనిపించలేదు. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉన్నా మూడు రోజుల తర్వాత చూస్తే నా గురించి చాలా ఫేక్ వార్తలు వచ్చాయి. ఆస్తులు అన్నీ అమ్ముకున్నారంటూ న్యూస్ రావడంతో స్పందించాల్సి వచ్చింది. ఆ సమయంలో చిరంజీవి నాకు ఎంతో సాయం చేశారు.’ అంటూ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాపై కూడా తనదైన శైలిలో స్పందించారు. అఖిల్ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదన్నారు.

Read also- Coolie Collections: పాన్ ఇండియాలో దూసుకుపోతున్న ‘కూలీ’.. అక్కడ మాత్రం!

చిరంజీవి కష్టాల్లో ఉన్న నిర్మాతలకు ఎలా సాయం చేస్తారో మరోసారి రుజువైందని మెగా అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అందుకే చిరంజీవితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇష్టపడతారని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. అదే సమయంలో అఖిల్ పై అభిమానులు మండి పడుతున్నారు. కష్టాల్లో ఉన్న నిర్మాతకు సాయం చేయాల్సిన బాధ్యత హీరోపై ఉంటుందని ఆ సమయంలో అఖిల్ అలా ప్రవర్తించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు అయితే అనిల్ సుంకర అఖిల్ పై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే లోపల చూసుకోవాలే కానీ ఇలా బహిరంగంగా చెప్పడం సరికాదంటున్నారు. ఏది ఏమైనా ఆ సమయంలో నిర్మాత రెండు పెద్ద సినిమాలు ఆడకపోవడంతో అలా మాట్లాడి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Read also- River In China: రివర్స్‌లో ప్రవహిస్తున్న నది.. వీక్షించేందుకు తరలివెళుతున్న జనం

భోళా శంకర్ 2023లో విడుదలైన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం, మేహర్ రమేశ్ దర్శకత్వం వహించగా చిరంజీవి హీరోగా నటించారు. ఇది తమిళ సినిమా ‘వేదాళం’ రీమేక్. కథలో భోళా శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు (కీర్తి సురేష్)ను రక్షించడానికి, తన గతంలో చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి చేసిన పోరాటమే ప్రధానాంశం. తమన్నా హీరోయిన్‌గా, సుషాంత్ కీలక పాత్రలో నటించగా, మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చారు.

ఏజెంట్ 2023లో విడుదలైన తెలుగు స్పై యాక్షన్ థ్రిల్లర్, సూరేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా అఖిల్ అక్కినేని హీరోగా నటించారు. ఈ సినిమాలో అఖిల్ ఒక రహస్య ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడు, దేశ భద్రత కోసం జరుగుతున్న ఆపరేషన్‌లో భాగంగా మిషన్‌ను పూర్తి చేయడానికి ప్రయత్నించే కథాంశం చుట్టూ నడుస్తుంది. ఇందులో మమ్ముట్టి, దినో మోరియా కీలక పాత్రలు పోషించారు, అలాగే సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. సంగీతాన్ని హిప్‌హాప్ తమిజా అందించారు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?