priyanka-mohan( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Priyanka Mohan: అలా చేయడంతో నెటిజన్లపై ఫైర్ అవుతున్న ‘ఓజీ’ హీరోయిన్..

Priyanka Mohan: ఇండియన్ సినిమా సెలబ్రిటీలకు ఏఐ టెక్నాలజీ చేదు అనుభవాలు మిగులుస్తుంది. ఎందుకంటే వాటిని ఉపయోగించి ప్రకటనలు, బోల్డ్ వీడియో కంటేంట్లు చేసి వాటిని విక్రయించి ఆదాయం అర్జిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అయితే ఈ ఏఐ సెగ ‘ఓజీ’ హీరోయిన్ ప్రియాంక మోహన్ కు తగిలింది. డీప్ ఫేస్ టెక్నాలజీ ఉపయోగించి ఆమె ఫేక్ వీడియోలను తయారు చేస్తున్నారు. వీటిని సృష్టించి షేర్ చేయడంపై ఆమె అసహనానికి గురయ్యారు. ఈ విషయంపై ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఏఐ సాంకేతికతను సృజనాత్మకంగా, నైతికంగా ఉపయోగించాలని ఆమె సూచించింది. “మనం సృష్టించేది, షేర్ చేసేది గురించి మైండ్‌ఫుల్‌గా ఉండాలి” అని పిలుపునిచ్చింది.

Read also-VD new movie: పూజా కార్యక్రమాలు జరుపుకున్న రౌడీ బాయ్ కొత్త సినిమా.. టైటిల్ ఇదేనా?

ఆమె ఏం అన్నదంటే.. “నా గురించి కొన్ని ఏఐ జనరేటెడ్ ఇమేజ్‌లు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ ఫేక్ విజువల్స్‌ను షేర్ చేయడం లేదా వ్యాప్తి చేయడం మానుకోండి. ఏఐని నైతిక సృజనాత్మకత కోసం ఉపయోగించాలి, తప్ప మిస్‌ఇన్ఫర్మేషన్ కోసం కాదు. మనం సృష్టించేది, షేర్ చేసేది గురించి జాగ్రత్తగా ఉందాం. ధన్యవాదాలు.” అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ద్వారా ఆమె ఏఐ సాంకేతికత దుర్వినియోగం గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నించింది. ఇలాంటి ఫేక్ కంటెంట్ వ్యాప్తి, వ్యక్తిగత గోప్యతకు ఆటంకం కలిగిస్తుందని ఆమె స్పష్టం చేసింది.

Read also-Dark Chocolate teaser: ‘డార్క్ చాక్లెట్’ టీజర్ ఇదే.. ఏంటి గురూ మరీ ఇలా ఉంది..

ప్రియాంక మోహన్ ఇటీవల పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ‘ఓజీ’ సినిమా భారీ విజయం సాధించింది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రంలో ఆమె కాన్మణి పాత్రలో నటించింది, ఇది పవన్ కల్యాణ్ భార్య పాత్ర. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగులో విలన్ గా కనిపించాడు. ప్రకాష్ రాజ్, శ్రీయ రెడ్డి, అర్జున్ దాస్ వంటి నటులు కూడా ముఖ్య పాత్రలు చేశారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద గట్టి రెస్పాన్స్ పొందింది. మొదటి వారంలో రూ. 169.3 కోట్లు సంపాదించగా, రెండో వారంలో రూ. 18.5 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఇండియాలో రూ. 188.52 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రియాంకకు మరింత ఫేమ్ తెచ్చిపెట్టింది. ప్రియాంక మోహన్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఉన్నత దశలో ఉంది. ఆమె త్వరలో రాజేష్ డైరెక్షన్‌లో ఒక సినిమాలో రవి మోహన్‌తో కలిసి నటించనుంది. అలాగే, కెన్ రాయ్‌సన్ డైరెక్షన్‌లో కెవిన్ హీరోగా ఒక ప్రాజెక్ట్‌లో పాల్గొంటుంది. ‘సరిపోదా శనివారం’ సినిమా తర్వాత ఈ కొత్త ప్రాజెక్టులు ఆమెకు మరిన్ని అవకాశాలు తీసుకొస్తాయని ఆశిస్తున్నారు. ఏఐ ఫేక్ ఇమేజ్‌ల వ్యాప్తి గురించి ఆమె చేసిన ఈ ప్రకటన, టాలీవుడ్‌లో డిజిటల్ ఎథిక్స్‌పై చర్చలకు దారితీసింది. అభిమానులు ఆమె సలహాను గౌరవించి, బాధ్యతాయుతంగా ఉండాలని ఆమె కోరింది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!