Prakash Raj: శివాజీ వ్యాఖ్యలు అహంకారంతో కూడినవి.. ప్రకాష్ రాజ్
prakesh-raj-shivaji
ఎంటర్‌టైన్‌మెంట్

Prakash Raj: మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు అహంకారంతో కూడినవి.. నటుడు ప్రకాష్ రాజ్

Prakash Raj: నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటీమణుల వస్త్రధారణపై ఆయన వాడిన పదజాలం, పరోక్షంగా వారిని కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో స్పందిస్తూ శివాజీ తీరును తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. యాంకర్ అనసూయ కూడా స్పందించారు ఈ విషయంపై విరుచుకు పడ్డారు. దీనికి యాంకర్ ఝాన్సీ కూడా మద్ధతు పలుకుతున్నారు. ఇదే క్రమంలో విషయాన్ని ప్రస్తావిస్తూ మెగా బ్రదర్ నాగబాబు కూడా దీనిపై స్పందించారు. తాజాగా ప్రకాష్ రాజ్ కూడా ఈ వివాదంపై తన ఉద్దేశం తెలిపారు. ఓ మీడియా సమావేశంలో ఈ విషయం గురించి ఇలా చెప్పుకొచ్చారు.

Read also-Shivaji Inquiry: మహిళా కమీషన్ ముందు హాజరైన్ శివాజీ . . కమీషన్ అడిగిన ప్రశ్నలు ఏంటంటే?

యాక్టర్ శివాజీ చాలా చెత్తగా మాట్లాడాడు.. మహిళల మీద మీ మాటలు అహంకారం తో కూడినవి, ఆడవాళ్ళ పట్ల ఇది మీ ఆలోచనకు నిదర్శనం.. సంస్కారులు అనుకున్న వాళ్ళు వేదిక మీద మాట్లాడేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.. అనసూయకు నా మద్దతు.. అమ్మలు, చెల్లెళ్ళు గురించి మాట్లాడే వాళ్ళు బుర్రలు అంత వరకే పనిచేస్తాయి.. మహిళలను కు సంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ళ అవయవాలు మాత్రమే కనిపిస్తాయి.. అంటూ శివాజీ పై ఫైర్ అయ్యారు. అదే విధంగా.. ఐ బొమ్మ రవి దొంగతనం చేశాడు. దొంగ ఎప్పుడూ..దొంగే? ధరలు పెరుగుతున్నాయంటే సినిమాలు చూడటం మానేయండి జెనో ఫోభియాతో తీసే సినిమాల వెనుక విషం ఉంది. అంటూ తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read also-Shivaji Controversy: తొడలు కనబడుతున్నాయనే.. నన్ను చూస్తున్నారు.. శివాజీ వివాదంపై శ్రీరెడ్డి కౌంటర్

యాక్టర్ శివాజీ ఆడవారిపై సంచలన వ్యాఖ్యలు చేసి మరో సారి వార్తల్లో నిలిచారు. ‘దండోర’ సినిమా డిసెంబర్ 25, 2025న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ ఆడవారి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ తనదైన శైలిలో మాట్లాడే శివాజీ ఇప్పుడు కూడా ఆడవారు గురించి, వారు వేసుకునే బట్టలు గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘అమ్మాయిలు హీరోయిన్లు మీరు కనబడేలా బట్టలు వేసుకుని పోతే మనమే నిందలు అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఏం అనుకోవద్దు మంచిగా చీర కట్టుకని రండి, ఎంతో అందంగా ఉంటుంది. మీ అందం నిండుగా చీరకట్టుకునే బట్టల్లో ఉంటుంది తప్పితే సామన్లు కనబడే దాంట్లో ఏం ఉండదు. మీ ముందు చాలా మాట్లాడతారు. చాలా బావున్నావు అంటారు, నువ్వు వెళ్లి పోయిన తర్వాత అంటారు ఇలాంటి బట్టలు వేసుకుంది కొంచెం మంచి బట్టుల వేసుకోవచ్చుకదా.. బావుంటావు కదా అంటూ మాట్లాడుకుంటారు. అంటూ చెప్పుకొచ్చారు. చాలా మందికి అలా అనాలనిపిస్తుందని కానీ అనలేమని, ఎందుకంటే స్త్రీ స్వతంత్రం స్వేచ్ఛ అంటారు అని చమత్కరించారు.

Just In

01

Digvijaya Singh: మోదీ పాత ఫొటో షేర్ చేసిన దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్‌‌లో అంతర్గత విబేధాలు బహిర్గతం?

Kalvakuntla Kavitha: కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ.. పాలమూరు – రంగారెడ్డిపై పెట్టలే.. బీఆర్ఎస్‌పై కవిత ఫైర్

Shivaji Apology: విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన శివాజీ ఏం చెప్పారంటే?

Motorola: భారత మార్కెట్‌కు మోటరోలా ‘సిగ్నేచర్’ సిరీస్..

Accreditation Policy: అక్రిడిటేషన్ కొత్త జీఓను సవరించాలి.. రెండు కార్డుల విధానానికి స్వస్తి పలకాలి.. టియూడబ్ల్యూజే డిమాండ్!