Prabhas: ‘హనుమాన్’ (Hanuman) వంటి సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఇటీవల ఒక పెద్ద వివాదంలో చిక్కుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ (Primeshow Entertainment) నిర్మాతలు ఆయనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు నమోదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రైమ్ షో నిర్మాతల ఆరోపణల మేరకు, ప్రశాంత్ వర్మ తమ బ్యానర్‌లో సినిమాలు చేసేందుకు అంగీకరించి, సుమారు రూ. 10 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకున్నారు. కానీ, ఆయన ఇప్పుడు వేరే బ్యానర్‌లలో ఆ ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తూ తమను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, ప్రశాంత్ వర్మ ఈ ఆరోపణలను ఖండించారు. నిర్మాతలు తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్‌ను ఎగ్గొట్టేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంపై ఛాంబర్‌లో విచారణ జరుగుతున్నందున, తాను ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని, దయచేసి పూర్తి సమాచారం లేకుండా ఊహాగానాలు రాయవద్దని ఆయన మీడియాను అభ్యర్థించారు.
Also Read- Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!
ప్రభాస్ ప్రాజెక్ట్‌పై సందేహాలు
ప్రశాంత్ వర్మపై వచ్చిన ఈ ఫిర్యాదు ప్రభావం ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులపై పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ ఒక భారీ ప్రాజెక్ట్ (‘బ్రహ్మరాక్షస్’ (Brahmarakshas Movie) అనే టైటిల్ పరిశీలనలో ఉంది) గురించి చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. తన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా ఆయన చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. అలాంటి ప్రభాస్.. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చుట్టూ ఉన్న ఈ ఆర్థిక వివాదాలు, న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తారా, రారా? అనే సందేహం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.
క్లీన్ చిట్ పొందితేనే..
ప్రభాస్ వంటి స్టార్ హీరోతో సినిమా అంటే, అది వందల కోట్ల బడ్జెట్‌తో కూడుకున్న వ్యవహారం. అలాంటి ప్రాజెక్ట్ ప్రారంభంలోనే దర్శకుడికి సంబంధించిన పాత వివాదాలు ఉంటే, అది సినిమా నిర్మాణంపై, ముఖ్యంగా ఫైనాన్సింగ్ పరంగా ప్రభావం చూపవచ్చు. అందువల్ల, ఈ వివాదం పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ప్రభాస్ టీమ్ నిశితంగా పరిశీలిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ తనపై వచ్చిన ఆరోపణల నుంచి క్లీన్ చిట్ పొందితే తప్ప, ప్రభాస్‌తో ఆయన చేయాలనుకుంటున్న కలల ప్రాజెక్ట్ ‘బ్రహ్మరాక్షస్’ పట్టాలెక్కడం కష్టమే అని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అలాగే ప్రభాస్ చేతుల్లో ఉన్న బిగ్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యే వరకు చాలా సమయం పడుతుంది కాబట్టి, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది కూడా చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
