Peddi Update: జాన్వీతో శ్రీలంకకు రామ్ చరణ్.. ఎందుకో తెలుసా?
Peddi Update (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Peddi Update: జాన్వీతో శ్రీలంకకు రామ్ చరణ్.. ఎందుకో తెలుసా?

Peddi Update: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ మూవీ (Peddi Movie) చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ చిత్రం, షెడ్యూల్ ప్రకారం నిర్మాణ పనులను పూర్తి చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్‌ను మేకర్స్ వదిలారు. ఈ చిత్ర యూనిట్ తదుపరి కీలక షెడ్యూల్ కోసం శ్రీలంక (Sri Lanka)కు పయనమైంది. శనివారం (అక్టోబర్ 25) నుంచి శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా, హీరోహీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)లపై ఒక అందమైన పాటను చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. ఈద్వీప దేశంలోని బ్యూటీఫుల్ లొకేషన్లలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రొమాంటిక్ ట్రాక్‌ను తెరకెక్కించడానికి దర్శకుడు బుచ్చి బాబు సానా, రామ్ చరణ్‌తో పాటు ఇతర కీలక బృంద సభ్యులు శ్రీలంకకు చేరుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో, ఈ పాట సినీ ప్రియులకు ఓ స్పెషల్ ట్రీట్‌గా నిలవనుంది అనడంలో సందేహమే లేదు.

Also Read- Allu Arjun: మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్.. ‘కాంతార: చాప్టర్ 1’పై ఐకాన్ స్టార్ రివ్యూ

సాలిడ్ కమ్ బ్యాక్‌ ఫిల్మ్

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. భారీ పాన్-ఇండియా చిత్రంగా ‘పెద్ది’ రూపొందుతోంది. ‘ఉప్పెన’ తర్వాత దర్శకుడు బుచ్చి బాబు సానాకు ‘పెద్ది’ ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా మారింది. రెండో చిత్రంతోనే మెగా పవర్ స్టార్‌ను డైరెక్ట్ చేస్తున్న బుచ్చిబాబుపై మెగా అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత సాలిడ్ కమ్ బ్యాక్‌గా చరణ్‌కు ‘పెద్ది’ నిలుస్తుందని వారంతా భావిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని లుక్స్‌లో, సరికొత్త అవతారంలో బుచ్చి చూపించబోతున్నారు. దీనికోసం రామ్ చరణ్ కూడా తనవంతు కృషి చేస్తూ, పలు మేకోవర్‌లకు సిద్ధమవుతూ, అంతేకాకుండా హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల కోసం తన పూర్తి అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read- Prabhas Spirit: ట్రీట్ అదిరింది.. బొమ్మ కనబడలేదు కానీ.. ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ మాస్ వైలెంట్!

భారీ అంచనాలు

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ అన్నీ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక శక్తివంతమైన పాత్ర‌లో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ అవార్డు గెలుచుకున్న ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా 27 మార్చి, 2026 న గ్రాండ్‌గా పాన్-ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం