Purushaha first look: రొటీన్ కు భిన్నంగా ఉండే కథలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి కథతోనే మరో సినిమా ‘పురుషః’ మన ముందుకు రాబోతుంది. ప్రపంచంలోని ఎన్నో యుద్ధాలు ఆడవారి కోసం మొదలైన కథలు చూసుంటాం. అయితే ఇది ఆడవారి మీదే యుద్ధం ప్రకటిస్తే ఎలా ఉంటదో ఈ సినిమాలో చెప్పబోతున్నారు దర్శకుడు. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు విడుదల చేస్తున్నారు. వైఫ్ వర్సెస్ వారియర్, వైఫ్ వర్సెస్ పీస్ మ్యాన్, వైఫ్ వర్సెస్ సిజర్ మ్యాన్ అంటూ వరుసగా ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది, స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం.. గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే.. అంటూ క్యాప్షన్స్ పెట్టి.. ప్రీ లుక్ పోస్టర్లతో ఆసక్తిని పెంచింది ‘పురుష:’ చిత్రయూనిట్. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష:’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు.
Read also-Raju Weds Rambai movie: ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడికి బెదిరింపు కాల్స్ వస్తాయి.. మంచు మనోజ్
ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్న పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ పాత్రల స్వభావం, వాటి తీరుని ప్రతిబింబించేలా పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ పోస్టర్ మీద ‘బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది..’ ఉన్న కంటెంట్‌ను చూస్తే సినిమా ఎలా ఉండబోతోందో అర్థం అవుతోంది. ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్‌లతో పాటుగా వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా రానున్న ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు.

Read also-Shiva 4K re-release: నాగార్జున చేసిన పనికి ఫిదా అయిన ఫ్యాన్స్.. ఏం చేశారంటే?
ఆద్యంతం అందరినీ అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కిషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్,రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెరైటీ కథ మంచి స్టార్ కాస్త్ ఉండటంతో ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Happy to be launching the #PurushahaFirstLook.
బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధ భూమిగా మారుతుంది…
Best wishes to the director @VeeruVulavala & the entire team for a blockbuster outing with #Purushaha @kalyanb949 @urvaishukrish @MeSapthagiri… pic.twitter.com/6vV2DX8SOT
— Srikanth Odela (@odela_srikanth) November 5, 2025
