OG Premier: పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది సినిమా ప్రీమియర్ షో ఎప్పుడు ఎక్కడ అనే విషయాలపై చాలా మంది అభిమానులకు తెలియక పోవచ్చు. అయితే ‘ఓజీ’ ప్రీమియర్ షో సెప్టెంబర్ 24 న రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లో పడనుంది. దీని కోసం హైదరాబాదులోని కొన్ని థియేటర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అందులో ప్రసాద్ ఐమ్యాక్స్, సుదర్శన్, సంధ్య, తదితర థియోటర్లు ఉన్నాయి. ఈ షోలు దాదాపు అమెరికాతో పాటుగా పడనున్నాయి. అంటే వాళ్లకంటే ముందుగానే సినిమా రివ్యూ రానుంది. ఈ ప్రీమియర్ షో ల కోసం బ్లాక్ టికెట్ మార్కెట్ తెరుచుకుంది. కొన్ని ప్రాంతాల్లో టికెట్ ధర అయిదు నుంచి ఆరు వేల వరకూ పలుకుతున్నాయి. పవన్ అభిమానులు మాత్రం టికెట్ ధర ఎంత అయినా లెక్కచేయకుండా సినిమా చూసేందుకు వెనకాడటంలేదు. ఈ టైమింగ్స్ అన్నీ హైదరాబాదు వరకూ మాత్రమే పరిమితం అవనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీమియర్ అర్ధరాత్రి 1 గంటకు పడనుంది. అయితే అప్పటికే మొత్తం ఎలా ఉందో తెలిసిపోతుంది.
Read also-Ambati Rambabu comments: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్.. ఏమన్నాడంటే?
స్టోరీ ఎంటంటే.. ఒక గ్యాంగ్‌స్టర్ రిటర్న్ చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్లే చేసే ‘ఓజస్ గంభీర’ (Ojas Gambheera) అనే క్యారెక్టర్, 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. ఆయన ముందు గ్యాంగ్ లైఫ్‌లో ఒక పాత శత్రువుతో (ఎమ్రాన్ హాష్మీ ప్లే చేసే ‘ఓమి భావు’) సెటిల్ చేసుకోవాలని మనసులో పెట్టుకుని, రివెంజ్ మిషన్‌లో ఎంబార్క్ అవుతాడు. ఇది కేవలం యాక్షన్ కాదు – ఇది భావోద్వేగాలతో కూడిన డార్క్ డ్రామా. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, బాడీ లాంగ్వేజ్, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఇంటెన్సిటీ – ఇవన్నీ స్క్రీన్ మీద అభిమానులకు కావాల్సినట్టుగా ఉంటాయి.
Read also-Delhi Baba: బాబా ముసుగులో రాసలీలలు.. 17 మందిపై లైంగిక దాడి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
‘ఓజీ’ సినిమా వెనుక ఉన్న క్రూ ఒక స్టార్ టీమ్ చిత్రాన్ని భారీ విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. డైరెక్టర్ సుజీత్, ‘సాహో’ ఫేమ్‌తో, స్టైలిష్ యాక్షన్, గ్రిప్పింగ్ నరేషన్‌తో మ్యాజిక్ చేశాడు. ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన అనుభవంతో, రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ చేత అద్భుతమైన విజువల్స్‌తో, ఎడిటింగ్ నవీన్ నూలి చేత క్రిస్ప్‌గా రూపుదిద్ధుకుంది. థమన్ ఎస్ మ్యూజిక్ మాస్ బీట్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేసేలా కంపోజ్ చేశారు. స్క్రిప్ట్ రైటర్స్ సైనాధ్ అల్లా, సుజీత్ కలిసి, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బలమైన కథనాన్ని అందించారు. ఈ టీమ్‌వర్క్ ‘ఓజీ’ని ఒక ఐకానిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది.