Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయబోతున్నారా?..
pawan-kalyan(image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయబోతున్నారా?.. ఆ నిర్మాత ఏం చెప్పాడు అంటే?

Pawan Kalyan: ‘ఓజీ’ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో తన షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఏ సినిమాకు సైన్ చేయలేదు. కనీసం సినిమాలు తీస్తారో లేదో కూడా తెలపలేదు. దీంతో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటున్నారు. అందుకు ఇంక సినిమాలు చేయడంలేదు, అని ప్రచారం జరిగింది. కానీ దీని గురించి ఆయన ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. దిల్ రాజు తన ప్రోడక్షన్లో సినిమా చేయాల్సి ఉంది చేస్తాం అని చాలా సార్లు చెప్పుకొచ్చారు. కానీ అది ఎంత వరకూ నిజమో ఎవరికీ తెలీదు. తాజాగా ఈ విషయం గురించి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన శిరీష్ పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఏడాది తమ బ్యానర్ నుంచి అరడజను సినిమాలు రాబోతున్నాయని, 2017 సంవత్సరంలాగా 2026 కూడా బ్యానర్ కు ఉంటుందని చెప్పుకొచ్చారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి అడగ్గా.. ఈ ఆరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Read also-Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే ముందు అంగీకరించిన సినిమాలను పూర్తి చేయాలనే నిర్ణయంతో ఉన్నారు. అందులో భాగంగా, ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ (OG) విడుదలయ్యాయి. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం ‘గబ్బర్ సింగ్’ కాంబో కావడంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పవన్ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా విరామం ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపించినా, మరోవైపు ఆయన కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు కూడా ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా నిర్మాణ సంస్థ వివరాలు, ఇతర నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కానప్పటికీ, ఇది పవన్ లైనప్‌లో ఉన్న చిత్రంగా తెలుస్తోంది.

Read also-Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

అయితే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయనకున్న బాధ్యతల దృష్ట్యా, పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమాను ఇప్పుడప్పుడే మొదలు పెట్టే అవకాశం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తి దృష్టి పాలనపై, రాజకీయాలపైనే కేంద్రీకృతం చేశారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలైన తర్వాత, పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు వేచి ఉండక తప్పదు. సురేందర్ రెడ్డి సినిమాను ఆయన ఎప్పుడు మొదలుపెడతారనేది పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రణాళికలు, సమయపాలనపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, పవర్ స్టార్ అభిమానులు మాత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా శిరీష్ చెప్పిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ మరో సినిమా చస్తున్నారన్నా వార్త కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Telangana Police: ఖాకీవనంలో కలుపు మొక్కలు.. టార్గెట్లు పెట్టుకుని మరీ నెలవారీ వసూళ్లు!

Gold Price Today: బిగ్ షాక్.. అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?

Parliament Winter Session 2025: సమావేశాలకు ముందే రచ్చ షురూ.. విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయబోతున్నారా?.. ఆ నిర్మాత ఏం చెప్పాడు అంటే?

Jogulamba Gadwal: ఆ గ్రామాభివృద్ధికి 22 హామీలు.. చర్చనీయాంశంగా మారిన బాండు పత్రం!