Nikhil Movie: యంగ్ సెన్సేషన్ నిఖిల్ (Nikhil) హీరోగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి వీ మెగా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం ‘ది ఇండియా హౌస్’ (The India House). ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామ్యాన్‌కు తీవ్రగాయాలు అయినట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో సముద్రపు సన్నివేశాలు తీసేందుకు భారీ వాటర్ ట్యాంక్‌ని ఏర్పాటు చేశారు. సడెన్‌గా ఆ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో.. లొకేషన్ అంతా నీటితో వరదలా మారిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామ్యాన్‌కు తీవ్రగాయాలవగా.. మరికొంత మందికి స్వల్పగాయాలు అయినట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ సమీపంలో జరిగిన ఈ ఘటనతో ప్రొడక్షన్‌కు తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read- Singer Mangli Controversy: బర్త్‌డే పార్టీ కాంట్రవర్సీ.. సింగర్ మంగ్లీ షాకింగ్ కామెంట్స్!
స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లుగా ఇప్పటి వరకు విడుదలైన సినిమా పోస్టర్స్, టీజర్ క్లారిటీ ఇచ్చాయి. రామ్ చరణ్, అతని స్నేహితుడు విక్రమ్‌తో కలిసి నూతన నిర్మాణ సంస్థను స్థాపించి, అందులో మొదటి సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. సినిమా ప్రారంభం రోజు ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయడం విశేషం. ‘ది ఇండియా హౌస్’గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం లండన్‌లోని ఇండియా హౌస్ నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇదని ఆల్రెడీ మేకర్స్ కూడా వెల్లడించారు. రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నిజంగానే బరువు తగ్గారా.. ఎందుకిన్ని డౌట్స్?
ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎటువంటి వార్తలు రాలేదు. సినిమా ప్రారంభం తర్వాత వచ్చిన ఓ టీజర్ మాత్రమే ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. ప్రస్తుతం ‘స్వయంభు’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న నిఖిల్, ఇటీవలే ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రారంభం రోజే అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నిఖిల్ విషయానికి వస్తే.. ‘కార్తికేయ 2’ సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ సినిమా తర్వాత వచ్చిన నిఖిల్ సినిమాలు అంతగా బాక్సాఫీస్ వద్ద ప్రతాపం చూపించలేకపోయినప్పటికీ రాబోయే సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా సినిమాలే కావడంతో పాటు, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కావడంతో.. మరోసారి నిఖిల్ టైమ్ స్టార్ట్ కాబోతుందని అంతా అనుకుంటున్నారు.
హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం
ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్ లో ఘటన
సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద..
అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు..
మరికొంత మందికి గాయాలు.. తీవ్ర నష్టం..
శంషాబాద్ సమీపంలో ఘటన pic.twitter.com/sLgjYNJ27c
— Nagarjuna (@pusapatinag) June 11, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు