Ott ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

November 2025 OTT Movies: ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..

November 2025 OTT Movies: ప్రతి వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ వారం పలు చిత్రాలు ఓటీటీలలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. డ్రామా నుంచి సూపర్‌హీరో యాక్షన్‌ వరకు, ప్రేమ కథల నుంచి ఫాంటసీ వరకూ వివిధ జానర్లలో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. మరి, ఈ వారం మనల్ని అలరించబోయే ఓటీటీ మూవీస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..

మై సిస్టర్స్ హస్బెండ్ ( My Sister’s Husband)

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ” మై సిస్టర్స్ హస్బెండ్ ” ఒక డ్రామా చిత్రం. ఈ సినిమా కథ ఏంటంటే.. ఒక మహిళ జీవితంలో అనుకోని మార్పులు చోటుచేసుకుంటాయి, ఆమె కాలేజీ వయస్కురాలైన చెల్లెలు ఇంట్లోకి వచ్చాక భర్త దృష్టి ఆమె వైపు కాకుండా చెల్లెలు వైపు మళ్లుతుంది. ఈ క్లిష్టమైన భావోద్వేగ కథలో దేవా మహెన్రా, తత్యానా సఫీరా, నికోల్ పర్హమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే పేరుతో ఒక నైజీరియన్ చిత్రం 2021లో విడుదలైంది. ఈ రోజు నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

బ్యాడ్ గర్ల్ ( Bad Girl)

తమిళంలో రూపొందిన ఈ బ్యాడ్ గర్ల్ చిత్రం వర్షా భారత దర్శకత్వంలో తెరకెక్కిన కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మొదటి సారి 2025 ఫిబ్రవరి 7న రోటర్‌డామ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రీమియర్ అయింది. తర్వాత సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 4 నుంచి జియో స్టార్ ఓటీటీ ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది.

ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ ( The Fantastic Four: First Steps)

మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందిన The Fantastic Four: First Steps అనే అమెరికన్ సూపర్‌హీరో నవంబర్ 5న ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. మార్వెల్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫ్రాంచైజ్‌కి కొత్త ఆరంభంగా నిలవనుంది.

కిస్ ( Kiss)

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు దర్శకుడిగా మారిన సతీష్ కృష్ణన్ తెరకెక్కించిన ఈ Kiss సినిమా రొమాన్స్, ఫాంటసీని కలిపిన ప్రత్యేకమైన కథతో వస్తోంది. ఈ సినిమాలో కవిన్, ప్రీతి అస్రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 7 నుంచి జీ 5 నుంచి స్టార్ ఓటీటీ ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది.

మిరాయ్ ( Mirai )

తెలుగులో వచ్చిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్ , కార్తీక్ గట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కింది. తేజ సజ్జా, మంచు మనోజ్, జగపతిబాబు, జయరామ్, శ్రీయా శరణ్, రితికా నాయక్ ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో పెద్ద హిట్ నిలిచిన ఈ చిత్రం అక్టోబర్ 10న జియోహాట్‌స్టార్‌లో విడుదలై, ఇప్పుడు దాని హిందీ వెర్షన్ కూడా స్ట్రీమ్ అవుతోంది. నవంబర్ 07 న జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

Just In

01

Dheekshith Shetty: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రంలో ఎందుకు చేశానంటే..?

Air India crash: ఎయిరిండియా క్రాష్‌లో బతికిన ఏకైక ప్యాసింజర్ ప్రవర్తనలో అనూహ్య మార్పు.. భార్య, కొడుకుతో..

Harassment Case: అసభ్యకరంగా మహిళను వేధిస్తున్న కీచక డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఎక్కడంటే..?

Bus Accident Victims: చేవెళ్ల బస్సు ప్రమాదం.. భయానక అనుభవాలను పంచుకున్న బాధితులు

Kishan Reddy: అభ్యర్థిని అద్దెకు తెచ్చుకున్నది ఎవరు?.. ప్రభుత్వం పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు