Ram Lakshman masters: సినీ ఇండస్ట్రీలో ఇది మొదటిసారి!
Ram Lakshman masters (Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Ram Lakshman masters: సినీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్.. ఫైట్సే కాదు డ్యాన్స్ లోనూ దుమ్ములేపారుగా..!

 Ram Lakshman masters: ఈ ప్రపంచంలో ఏం జరిగినా సరే.. క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా సెలబ్రిటీలు వేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి, వాళ్లెవరో ఇక్కడ  తెలుసుకుందాం..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణులు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, వీరిద్దరూ దేవుడి పాటకు డాన్స్ వేసి అందర్ని ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే మోత మోగించిన రఘుకుల తిలక పాటకు అద్భుతంగా డాన్స్ వేశారు. అయితే, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్స్ ” నా చిన్నప్పటినుండి ఎంతో ఇష్టమైన ఫైట్ మాస్టర్ పేదరికం నుండి ఉన్నత స్థానానికి చేరిన రామ్ లక్ష్మణ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. టాలెంట్ కి వయసు తో సంబంధం లేదు, పేదరికం కడుపు కే కానీ కళకు కాదు అని నిరూపించారు మీరు ముగ్గురు. మీరు ఎంతోమందికి స్ఫూర్తి అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

గ్రేట్ ఫైట్ మాస్టర్స్ ఇద్దరు చాలా బాగా డాన్స్ చేశారు. గురు స్వామి గారికి ధన్యవాదాలు. ఈ డ్యాన్స్ చూడడానికి  రెండు కళ్ళు చాలట్లేదు.. చాలా సంతోషం రాంలక్ష్మణ్ కొండలస్వామితో డాన్స్ చేస్తున్నారు రామ నామ మహత్యం ఇదే ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?