Mohan Lal: చేతికి గాజులు.. మెడలో హారం.. మోహన్‌లాల్‌కు ఏమైంది!
Mohan Lal (Image Source: Youtube Video)
ఎంటర్‌టైన్‌మెంట్, లేటెస్ట్ న్యూస్

Mohan Lal: చేతికి గాజులు.. మెడలో ఆడవారి హారం.. మోహన్‌లాల్‌కు ఏమైంది!

Mohan Lal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందులో ఆయన చేతికి గాజులు, మెడలో హారం, ఆడవారిలా హావభావాలు ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ లాల్ కు ఏమైందంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అటు మోహన్ లాల్ ఫ్యాన్స్ సైతం ఆ ఫొటోలను చూసి కాస్త టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ మోహన్ లాల్ అలా ఎందుకు చేశారు? దానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

వాణిజ్య ప్రకటన కోసం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోహన్ లాల్ ఫొటోలు.. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించినది. ‘తుడరుమ్’ చిత్రంలో మోహన్ లాల్ కు విలన్ గా చేసిన ప్రఖ్యాత యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాష్ వర్మ (Prakash Varma) దానికి దర్శకత్వం వహించారు. బంగారు నగలు, ఆభరణలు విక్రయించే విన్స్మెరా జ్యూయలర్స్ (Vinsmera Jewels) కోసం ఈ ప్రకటన రూపొందించారు. 110 సెకన్ల నిడివి కలగిన ఈ యాడ్ లో మోహన్ లాల్ కారు దిగి సెట్లోకి వస్తారు. మోడల్ శివాని ఫ్యాషన్ ఫొటో గ్రఫి కోసం వజ్రాల ఆభరణాల సెట్ తీసుకొచ్చినట్లు ప్రకాష్ వర్మ.. మోహన్ లాల్ తో అంటారు. వాటిని రహస్యంగా క్యారీ వ్యాన్ లోకి తీసుకెళ్లిన మోహన్ లాల్.. అద్దం ముందు నిలబడి వజ్రాల హారాన్ని మెడలో ధరిస్తాడు. చేతికి గాజులు ధరించి.. అచ్చం ఆడవారిలాగా హావభావాలు వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం ఈ యాడ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read: Uttar Pradesh Crime: మామను చితకబాదిన కోడలు.. మంచంపై పడేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్!

నెటిజన్లు ప్రశంసలు
సాధారణంగా జ్యూయలరీ యాడ్స్ లో హీరోలు నటించినప్పటికీ ఎప్పుడు హారాలు ధరించలేదు. అయితే తొలిసారి ఒక స్టార్ హీరో నటించడం.. అది కూడా ఆడవారి హారాన్ని మెడలో ధరించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా యాడ్ చేయాలంటే గట్స్ ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. హారం ధరించిన తర్వాత అతడు పలికించిన హావభావాలు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం మోహన్ లాల్ చేసిన పనిని తప్పుబడుతున్నారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకునేలా నటించడం బాలేదని విమర్శిస్తున్నారు. డబ్బు కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మెుత్తం మీద మోహన్ లాల్ చేసిన జ్యూయలరీ యాడ్.. ఎప్పుడు లేని విధంగా కొత్త చర్చకు తావిచ్చింది.

Also Read This: Cancer Symptoms: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. నిర్లక్ష్యం చేయోద్దు.. క్యాన్సర్ కావొచ్చు!

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం