NBK 111: తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ (NBK) 111వ చిత్రం షూటింగ్ నేడు (నవంబర్ 26, 2025) అధికారికంగా ప్రారంభమైంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న ఈ సినిమాపై దర్శకుడు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వీర సింహా రెడ్డి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో, ‘NBK 111’పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో, సినిమా ప్రారంభం గురించి గోపీచంద్ మలినేని ఉద్వేగభరితమైన ప్రకటన చేశారు. దీనిని చూసిన బాలయ్యబాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అఖండ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Read also-Champion Movie: రోషన్ ‘ఛాంపియన్’ సినిమా నుంచి ‘గిర గిర గిరగింగిరానివే’ లిరికల్ వీడియో వచ్చేసింది..
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా గోపీచంద్ మలినేని ఇలా రాసుకొచ్చారు.. “Big day. A new beginning… a new benchmark. This HISTORICAL ROAR, this vision… is finally taking its first breath,” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ చారిత్రక గర్జన, ఈ కల నేడు తమ మొదటి శ్వాసను తీసుకుంటుందని, ఈ ప్రాజెక్ట్ తమకు ఒక నూతన ఆరంభం, ఒక కొత్త బెంచ్‌మార్క్ అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దర్శకుడిగా తన లక్ష్యం స్పష్టంగా ఉందని, నందమూరి బాలకృష్ణ లాంటి ‘God of Masses’తో కలిసి ఈ ప్రయాణంలో అడుగులు వేయడం తన అదృష్టమని ఆయన కృతజ్ఞతా భావాన్ని ప్రకటించారు.
Read also-Mandhana Wedding: స్మృతి మంధాన పెళ్లి వాయిదాకు కారణం ఇదే.. మామ కోసం పలాష్ ముచ్చల్ ఏం చేశారంటే?
చారిత్రక నేపథ్యం
‘NBK 111’ కేవలం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, ఒక చారిత్రక నేపథ్యం ఉన్న భారీ డ్రామాగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్‌లను, అత్యున్నత సాంకేతిక విలువలను ఉపయోగిస్తున్నారని సినీ వర్గాల టాక్. వెంకట సతీశ్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో, బాలకృష్ణ శక్తివంతమైన చారిత్రక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం లేడీ సూపర్‌స్టార్ నయనతార ఎంపికైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆమె రాణి పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది, ఇది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు నేపథ్య సంగీతం కూడా సినిమా రేంజ్‌ను పెంచేలా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తం మీద, గోపీచంద్ మలినేని బాలకృష్ణ ఈ కలయిక టాలీవుడ్‌లో నూతన రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చారిత్రక గర్జన ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
Big day ❤️❤️
A new beginning… a new benchmark.This HISTORICAL ROAR, this vision…
is finally taking its first breath.As we begin today, my heart is full and my purpose is clear. Grateful to walk this path with God of Masses #NandamuriBalaKrishna garu 🤗🤗🙏🏻🙏🏻#NBK111… pic.twitter.com/hdXn9jUrTt
— Gopichandh Malineni (@megopichand) November 26, 2025
