Nayanthara ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Nayanthara: ఒక రాత్రి అలా చెయ్యి.. ఛాన్స్ ఇస్తా.. నయనతారకి షాకిచ్చిన ప్రొడ్యూసర్?

Nayanthara: ఇప్పుడు నటిస్తున్న సీనియర్ హీరోయిన్‌లు ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్ర స్థానంలో నిలిచిన వారు. అయితే, వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చారు. బయటి నుండి చూసిన వారికి ఎలాంటి సమస్యలు లేవని అనుకుంటారు. కానీ, వాస్తవానికి వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఒకరు.

నయనతార మలయాళ మూవీ మనస్సినక్కరే (2003) తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. అయితే, ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చిన సినిమా తమిళ సూపర్‌హిట్ చంద్రముఖి (2005). ఈ సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించినప్పటికీ, నయనతార పాత్ర కూడా అందర్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన యోగి, దుబాయ్ శీను, తులసి, అదుర్స్, గజినీ, లక్ష్మి, బాస్, శ్రీరామరాజ్యం వంటి హిట్ సినిమాలతో తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

కానీ, ఈ సక్సెస్ వెనుక నయనతార ఎదుర్కొన్న సవాళ్లు సాధారణమైనవి కావు. ఆమె కెరీర్ మొదట్లో ఒక ప్రముఖ నిర్మాత ఆమెకు ఒక పెద్ద హీరో చిత్రంలో ఛాన్స్ ఇస్తానని, దానికి బదులుగా ఒక రాత్రి తనతో గడపాలని అడిగాడట. దీంతో, షాక్‌ అయిన నయనతార, ఆ నిర్మాతను బాగా తిట్టుకుందట. సినిమా అంటే ఇవి కూడా ఉంటాయా? “అయిన నాకు టాలెంట్ ఉంది. ముఖ్యంగా, నా మీద నాకు నమ్మకం ఉంది. అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు చెప్పే అలాంటి మార్గాలు నాకు అవసరం లేదని ” అంటూ ఆ నిర్మాత మాటలను ఖండించి, తన ఆత్మగౌరవంతో తిరిగి వచ్చేసిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!