Nayanthara Gift: లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ నుండి ప్రతి సంవత్సరం ఖరీదైన విలాసవంతమైన బహుమతులు అందుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా విఘ్నేష్ శివన్ ఇచ్చిన సర్ప్రైజ్ బహుమతి సౌత్ సినిమా సర్కిల్స్‌లో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నయనతార 41వ పుట్టినరోజును పురస్కరించుకుని విఘ్నేష్ శివన్ ఆమెకు అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ (Rolls-Royce Black Badge Spectre) కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర దాని ప్రత్యేకతలు ఎవరినైనా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. ఈ సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ లగ్జరీ కూపే కారు విలువ భారతదేశంలో దాదాపుగా రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. కస్టమైజేషన్ ఆధారంగా ఈ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఏది ఏమైనా దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇవ్వడం అమెకు తగునే అంటూ సామాజికి మాధ్యమాల్లో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read also-Aishwarya Rai: ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్.. ఎందుకంటే?
రోల్స్ రాయిస్ నుండి వచ్చిన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఇది. భారతదేశంలో ఈ మోడల్‌ను సొంతం చేసుకున్న తొలి నటీమణులలో నయనతార ఒకరు కావడం విశేషం. విఘ్నేష్ శివన్ ఈ కారుతో నయనతార వారి కవల పిల్లలు ఉయిర్, ఉలగ్‌లతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి, అభిమానులు సినీ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Read also-Konda Madhavi Latha: బ్రదర్ అంటూనే రాజమౌళిపై ఫైర్ అయిన బీజేపీ నాయకురాలు.. మూలాలపై అలాంటి మాటలా..
విఘ్నేష్ శివన్, నయనతారకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వడం ఇది కొత్తేమీ కాదు. గత కొన్నేళ్లుగా వారి ప్రేమను, ఆప్యాయతను చాటుకునేందుకు ఆయన విలాసవంతమైన బహుమతులను అందిస్తున్నారు. నయనతార 39వ పుట్టినరోజు సందర్భంగా మెర్సిడెస్ మేబ్యాక్ (Mercedes-Maybach) కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర సుమారు రూ.3 కోట్ల నుండి రూ.3.40 కోట్ల వరకు ఉంది. ఆ తర్వాత సంవత్సరం, ఆమెకు మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ GLS 600 కారును బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా, ఏకంగా రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ బహుమతిగా ఇచ్చి, తన భార్యపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని మరోసారి ఘనంగా చాటుకున్నారు. విఘ్నేష్ శివన్ ఇచ్చిన ఈ ఖరీదైన రోల్స్ రాయిస్ బహుమతి, నయనతార సినీ కెరీర్ వ్యక్తిగత జీవితంలో ఆమె సాధించిన విజయాలకు అద్దం పడుతోంది. వారి వైవాహిక జీవితంలో ఈ విలాసవంతమైన సర్ప్రైజ్‌లు ఒక ప్రత్యేకతను నింపుతున్నాయి. ప్రస్తుతం నయనతార మెగాస్టార్ సరసన మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నరు. తాజాగా బాలయ్య బాబుకు నాలుగో సారి జోడీగా నటించబోతున్నాట్లు కూడా ప్రకటించారు.
