Nayanthara
ఎంటర్‌టైన్మెంట్

Nayanthara | యష్ తో నయన్… ఒక్క హింట్ తో దొరికిపోయారుగా!!

అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల జాబితాలో చేరిపోయిన యష్ నుండి తాజాగా వస్తున్న చిత్రం ‘టాక్సిక్’. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాల సిరీస్ తో పాన్ ఇండియా హీరోల సరసన చేరారు యష్. కేజీఎఫ్ సిరీస్ లలో రాఖీభాయ్ గా అలరించాడు. ప్రస్తుతం ఈ హీరో ‘టాక్సిక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ కూడా సగం పూర్తయింది. ఇటీవలే టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ తో ఒక్కసారిగా మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీని మాత్రం టీజర్ లో చూపించలేదు. దీనికి తోడు ఈ సినిమాలో నయనతార (Nayanthara) కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇది చిత్ర బృందం నుండి లీక్ అవ్వడంతో అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసుకుంటున్నారు అభిమానులు. ఈ విషయాన్ని ఎవరో కాదు ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను సినిమా షూటింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలో నయనతార (Nayanthara) కూడా నటిస్తోందని హింట్ ఇచ్చారు అక్షయ్. ఇంతకుమించి వివరాలను ఆయన ఏమి వెల్లడించలేదు. త్వరలోనే ఈ సినిమాపై మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఒక ప్రకటన చేస్తారని చెప్పిన ఆయన, అప్పటివరకు ఎదురుచూడాల్సిందే అని కూడా తెలిపారు. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా ఉన్న కియారాతో రెండు కీలక షెడ్యూల్స్ కూడా చిత్ర బృందం పూర్తి చేసింది.

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..