court
ఎంటర్‌టైన్మెంట్

Nani: ‘కోర్ట్‌’ నచ్చకపోతే.. నా సినిమా ఎవరూ చూడకండి: నాని

Nani: వరుసగా హిట్ మూవీస్‌తో దూసుకెళ్తున్న టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రోడ్యూసర్ గానూ రాణిస్తున్నాడు. తన వాల్ పోస్టర్స్ బ్యానర్‌పై విభిన్న కథలతో కూడిన చిత్రాలను అందిస్తున్నాడు. తాజాగా ‘కోర్ట్’ చిత్రంతో మరోసారి ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని పంచేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీకి స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది క్యాప్షన్. ప్రియదర్శి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ మూవీకి రామ్ జగదీష్ డైరెక్షన్ వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో నాని, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, ఇంద్రగంటి మోహన కృష్ణ, దేవకట్టా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ.. ‘ఇక్కడికి వచ్చిన తమ డైరెక్టర్స్‌కి థాంక్యూ సో మచ్. ఈ సినిమా గురించి ఒక విషయం బలంగా చెబుతున్నాను. 14న ఈ సినిమాని మీరు మిస్ అవ్వకండి. నా కెరియర్‌లో ఎప్పుడూ కూడా దయచేసి సినిమా చూడండి అని అడగలేదు. కానీ ఈ సినిమాకు అడుగుతున్నాను. దయచేసి ఈ సినిమా చూడండి. 14న థియేటర్‌కి వెళ్ళండి. ఇలాంటి మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని చెబుతున్నాను. మాకేదో సక్సెస్ రావాలని కాదు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మంచి సినిమాని మిస్ కాకూడదని చెబుతున్నాను. మీ అందరిని బ్రతిమాలుతున్నాను. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళండి. గొప్ప సినిమా చూశారానే ఫీలింగ్‌తో వస్తారు. ఒకవేళ 14న కోర్ట్ సినిమాకి వెళ్లి నేను చెప్పిన అంచనాలని మ్యాచ్ కాలేదని అనిపిస్తే.. మరో రెండు నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3ని ఎవరూ చూడొద్దు. ఇంతకంటే బలంగా చెప్పలేను. 14న థియేటర్‌కి వెళ్ళండి. చాలా హ్యాపీగా ఫీలౌతారు. సినిమా చూసినప్పుడు నాకు గొప్ప ఎక్స్‌పీరియన్స్ కలిగింది. మూవీ చూసిన తర్వాత మీరే అందరికీ చెబుతారు. టీం అందరికీ కంగ్రాట్స్ అండ్ థాంక్ యూ. తెలుగు సినిమాకి గ్రేట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇచ్చారు. మార్చి14న థియేటర్స్ లో కలుద్దాం’ అని అన్నారు.

Also Read: సినీ ఇండస్ట్రీకి సమంత వచ్చి 15 ఏళ్లు పూర్తి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘నాని అన్న థాంక్యూ సో మచ్. బలగం తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ సినిమా చేయమని చెప్పారు. మా టీమ్ అంతా ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నాని అన్న. ఈ సినిమాలలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ చాలా గొప్పగా చేశారు. ఇంతమంది దర్శకులు నాని అన్న కోసం ఈ సినిమా కోసం రావడం చాలా ఆనందంగా ఉంది. నేను నాని అన్న తమ్ముణ్ణి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. ఈ సినిమా 14న థియేటర్లో వస్తుంది. ఇది కూడా ఒక సూపర్ హీరో లాంటి కథ. కోటేసుకున్న ప్రతిసారి ఒక బ్యాట్మెన్ లో ఫీల్ అయ్యా. 14న థియేటర్లో కలుద్దాం. సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుందాం’ అని పేర్కొన్నారు.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?