Bigg Boss 9 Telugu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss 9 Telugu: అతనికి మాత్రమే సపోర్ట్ చేస్తూ.. బిగ్ బాస్ పై నాగబాబు సంచలన పోస్ట్

Bigg Boss 9 Telugu: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్‌గా ఆదివారం ప్రారంభమైంది. హోస్ట్ గా వ్యవహిస్తున్న నాగార్జున ఈ సీజన్‌లో ఊహించని ట్విస్ట్‌లతో షో మరో స్థాయిలో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి 15 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. వీరిలో 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. తనూజ, ఆశాషైనీ, సంజనా గల్రానీ, ఇమ్మానుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, శ్రేష్ఠ వర్మ, భరణి శంకర్ ఉన్నారు. 6 మంది సామాన్యులు మాస్క్ మెన్ హరీష్, సోల్జర్ పవన్ కల్యాణ్, శ్రీజ దమ్ము, మర్యాద మనీష్, ప్రియా శెట్టి.. ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికయ్యారు. ఈ 15 మంది 15 వారాల పాటు హౌస్‌లోరచ్చ చేయనున్నారు.

ఇందులో సీరియల్ నటుడు భరణి శంకర్ పేరు అందరికీ సుపరిచితమే. ‘చిలసౌ స్రవంతి’, ‘కుంకుమ రేఖ’, ‘సీతామహాలక్ష్మి’ వంటి సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. 30కి పైగా సీరియల్స్‌లో తనదైన నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న భరణి, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి భరణి శంకర్‌కు భారీ మద్దతు లభించింది. మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, భరణి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ షేర్ చేశారు.

“నా సన్నిహితుడు భరణి శంకర్ బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ జర్నీ అతనికి విజయం, గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా.. ” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు భరణి రియాక్ట్ అవుతూ.. “మీ సపోర్ట్‌కు థాంక్స్ నాగబాబు సర్!” అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక జనసైనికులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. చాలా మంది భరణికి ‘ఆల్ ది బెస్ట్’ అంటూ విషెస్ చెబుతుండగా, మరికొందరు నాగబాబు పోస్ట్‌పై సెటైర్లు వేస్తూ, “ఇప్పుడు జనసైనికులు ఫోనుల్లో బిజీ అవుతారు. అలాగే ఓటింగ్‌లో కూడా అదే పనిగా ఓటింగ్ చేస్తూ ఫుల్ బిజీగా మారతారు”  అని కామెంట్లు పెడుతున్నారు.

Just In

01

OTT Movies: ఓటీటీ లవర్స్ కి పండగే.. ఆ రెండు సినిమాలు వచ్చేస్తున్నాయి.. చూసేందుకు మీరు సిద్ధమేనా?

Zelensky: భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి స్పందన

Mahabubabad District: యువకుడి పై ఆత్మహత్యా యత్నం.. పట్టించుకోని అధికారులు

Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలతో.. వందే భారత్ స్లీపర్ రైలు.. పండగే పండగ!

Mahabubabad District: ఆ కార్యాలయంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. పట్టించుకోని అధికారులు