Nabha Natesh: నభా నటేష్.. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు దర్శనమిచ్చే నటి. ఈ మధ్యకాలంలో ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి. మళ్లీ తన సత్తా చాటేందుకు నానా రకాలుగా అమ్మడు ప్రయత్నిస్తూనే ఉంది. దర్శకనిర్మాతల కళ్లలో పడేందుకు ఆమె ఎంతగా ట్రై చేయాలో అంతగా చేస్తుంది. ఆ ప్రయత్నంలో కొంత మేర సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆమె చేసే ప్రయత్నాలు ఏమిటని అనుకుంటున్నారా? హాట్ హాట్ ఫొటో షూట్స్. అవును.. ప్రతి వారం ఆమె నుంచి హాట్ ఫోజులతో వచ్చే ఫొటో షూట్ ఫొటోల కోసం నెటిజన్లు ఎంతగానో వేచి చూస్తుంటారు. అలా వేచి చూసే వారిని డిజప్పాయింట్ చేయకుండా.. ఏదో రకంగా నభా ట్రీట్ ఇస్తూనే ఉంది. మరి ఇది ఎంత వరకు ఆమెకు వర్కవుట్ అయిందనేది పక్కన పెడితే.. అబ్బ ఏముందిరా? అనే మాట మాత్రం నెటిజన్లతో అనిపించుకుంటూ ఉంటుంది.
Also Read- Akhil Zainab: అఖిల్, జైనబ్ పెళ్లి చేసుకోబోతుంటే.. ఇప్పుడీ వార్తలేంటి?
ఆమె ప్రయత్నాలు ఫలించి.. రెండు మూడు అవకాశాలు కూడా ఆమెను వరించడం విశేషం. కేవలం ఫొటో షూట్స్‌తోనే మెప్పించలేనని అనుకుందో ఏమోగానీ, ఇప్పుడు సమయస్ఫూర్తిని ఉపయోగించి సరికొత్తగా నెటిజన్ల ముందుకు వచ్చిందీ ఇస్మార్ట్ బ్యూటీ. అదేంటంటే.. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (World Environment Day 2025) పురస్కరించుకుని.. ఓ చెట్టును కౌగిలించుకున్న ఫొటోతో.. ఫొటో షూట్ చేసిందీ భామ. ఆ ఫొటోలను నెట్ ప్రపంచానికి రిలీజ్ చేయడంతో.. అందరూ నభాలో కూడా మ్యాటరుంది. విషయాన్ని పట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలతో పాటు ఓ ఎమోషనల్ మెసేజ్‌ని కూడా ఆమె షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌తో నభా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నేచర్ గురించి బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిందంటూ అంతా ఆమెను ప్రశంసించేలా చేసుకుంది.
Also Read- Vishal: శుభమా అని పెళ్లికి రెడీ అవుతున్న వేళ.. విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!
ఇంతకీ ఆ ఎమోషనల్ మెసేజ్ ఏమిటంటే.. ‘‘ఈ రోజు నేను ఒక చెట్టును కౌగిలించుకున్నాను. ఎందుకో తెలియదు కానీ, ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. మనమంతా ఎంతో అందమైన ప్రపంచాన్ని చూసేందుకు వచ్చిన అతిథులం. ఇక్కడ ప్రకృతి మనకెన్నో గొప్ప అనుభవాలను ఇస్తోంది. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని ఉన్నంత వరకు అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన ప్రకృతికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని ఆమె చేసిన పోస్ట్ చూసిన వారంతా, ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ.. నభా కూడా విషయాన్ని పట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నభా నటేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నిఖిల్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభు’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా ‘నాగబంధం’ అనే మరో ప్రతిష్టాత్మక చిత్రంలోనూ అవకాశం దక్కించుకుంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని చిత్రాలు కథా చర్చల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Hugged a tree today, pretty sure it hugged me back.
It felt like the Earth whispered, “You’re part of this.”
Not the center, not the author—just stardust in its spell.
Here to feel, grow, exist.
On World Environment Day, I’m just grateful to be written in.#WorldEnvironmentDay pic.twitter.com/AHAY0hmPbN— Nabha Natesh (@NabhaNatesh) June 5, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు