Mumaith Khan: ‘ఓరోరి యోగి నన్ను కొరికెయ్‌రో..’, ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అంటూ ఊపేసే సాంగ్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేసిన ముమైత్ ఖాన్‌కు ఈ మధ్య సినిమా అవకాశాలు అయితే లేవు కానీ, నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమె చేసే డ్యాన్స్ వీడియోలు, పెట్టే పోస్ట్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆమె కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చిన సాంగ్స్‌కి డ్యాన్స్ చేస్తున్న వీడియోలతో ముమైత్ అందరినీ ఆకర్షిస్తుంటుంది. అలాంటి ముమైత్ చాలా రోజుల తర్వాత పబ్లిక్‌లోకి వచ్చింది. వీలైక్ మేకప్, హెయిర్ అకాడమీ ఈవెంట్ నిమిత్తం ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముమైత్ సందడి చేసింది.
Also Read- Pragya Jaiswal: ‘అఖండ 2’ నుంచి ప్రగ్యాను ఎందుకు తీసేశారు?
బ్యూటీ ఎడ్యుకేషన్, ట్రైనింగ్‌లో కొత్త శకానికి నాంది పలుకుతూ హైదరాబాద్, యూసుఫ్‌గూడలోని ‘వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ’ బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మోటాలజీ, స్కిన్‌కేర్ మరియు వెల్‌నెస్‌లో నైపుణ్యంపై సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వీలైక్ అకాడమీ డైరెక్టర్ అయిన ముమైత్ ఖాన్‌తో పాటు.. కో ఫౌండర్స్ కెయిత్, జావేద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్సా ఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్ వంటివారు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో వీలైక్ మేకప్ మరియు హెయిర్ అకాడమీ వ్యవస్థాపకురాలు ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రస్తుత తరాన్ని, రాబోయే తరాన్ని దృష్టిలో పెట్టుకుని, వివిధ బ్యూటీ అంశాలపై నిపుణులను ప్రోత్సహించడానికి వీలైక్ మేకప్, హెయిర్ అకాడమీ సమగ్ర పాఠ్యప్రణాళికను సిద్ధం చేసింది. అత్యాధునిక సౌకర్యాలు, పరిశ్రమ – ప్రముఖ బోధకుల బృందంతో, వీలైక్ సాంకేతిక నైపుణ్యంతో విద్యార్థులను శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్యూటీ పరిశ్రమపై ఇష్టమున్న వ్యక్తులను గుర్తించి, వారికి అన్ని రకాలుగా అవగాహన కల్పించడంతో పాటు.. బ్రైడల్, హెయిర్ మేకప్ ట్రైనింగ్ ప్రాధాన్యంగా ప్రపంచ స్థాయిలో ట్రెయిన్డ్ స్పెషలిస్ట్‌లుగా వారిని తయారు చేయడమే మా లక్ష్యమని చెప్పుకొచ్చింది.
ఇంకా ఈ కార్యక్రమంలో వీలైక్ కో ఫౌండర్స్ కెయిత్, జావేద్‌లు మాట్లాడుతూ.. వాస్తవ-ప్రపంచ సెలూన్ అనుభవాలను అనుకరిస్తూ, పోటీ మార్కెట్‌లో రాణించడానికి, విద్యార్థులను సిద్ధం చేసే అభ్యాస వాతావరణం మా అకాడమీలో ఉంది. ఈ అభ్యాసంతో విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అన్నారు. కాగా, చాలా రోజుల తర్వాత ముమైత్ ఇలా కనిపించడంతో.. అంతా ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.