Mowgli 2025: సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ 2025’. ఈ సినిమా డిసెంబర్ 12, 2025న విడుదలకు సిద్దంగా ఉంది. చివర్లో బాలయ్య బాబు సినిమా వల్ల సినిమాకు కష్టాలు తప్పడం లేదు. అఖండ 2 సినిమా ఇప్పటికే డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. ఆర్థిక కారణాలతో విడుదల వాయిదా పడింది. ఆ సినిమా ఇప్పుడు డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమైంది. దీంతో ఆ రోజు విడుదల అవుతున్న సినిమాలకు ఇది ఇబ్బందులు తెచ్చి పెట్టింది. దీంతో 12న విడుదల కావాల్సిన మోగ్లీ సినిమా కూడా ఒకరోజు వెనక్కి తగ్గింది. మోగ్లీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 13న విడుదల కానుంది. 12వ తేదీని ప్రీమియర్లు వేయనున్నారు. దీనికి సంబంధించి మూవీ టీం పోస్టర్ ను విడుదల చేసింది. జాతీయ అవార్డు గ్రహీత, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ‘మోగ్లీ 2025’ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా అడవి నేపథ్యంతో రూపొందించారు.
Read also-Bigg Boss Telugu9: భరణి వల్ల సుమన్ శెట్టికి అన్యాయం!.. కళ్యాణ్ అదంతా కావాలనే చేశాడా?..
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే, ఇందులో ప్రేమ, సంఘర్షణ, భావోద్వేగాలు మేళవించినట్టు తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రాజ్ ఈ కథను రామాయణంలోని పాత్రల ఛాయలతో ఆధునిక నేపథ్యంలో రూపొందించినట్లు ఇటీవల వెల్లడించారు. ఈ కథలో హీరో రోషన్ కనకాల పాత్ర ‘రాముడి’ని పోలి ఉంటుందని, విలన్ పాత్ర ‘రావణుడి’ మాదిరిగా ఉంటుందని దర్శకుడు సందీప్ రాజ్ తెలిపారు. ట్రైలర్ విజువల్స్ రోషన్ పాత్రలోని తెగువను, ధృడ సంకల్పాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆయన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర (సాక్షి సాగర్ మడోల్కర్) డెఫ్ అండ్ డమ్గా డిజైన్ చేయబడింది. ‘ప్రేమకు భాష అవసరం లేదు, అది అనుభూతి చెందాలి’ అనే బలమైన ఫిలాసఫీని చెప్పేందుకు ఈ పాత్రను రూపొందించినట్టు దర్శకుడు పేర్కొన్నారు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.
Read also-Aadarsha Kutumbam: వెంకీ మామ, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ఇదే.. మొదలైన ఫైరింగ్..
డైరెక్టర్ కమ్ యాక్టర్ బండి సరోజ్ కుమార్ ఇందులో విలన్‌గా నటించారు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, గత కొన్నేళ్లుగా తెలుగులో ఇలాంటి విలన్ పాత్రను చూసి ఉండరని సందీప్ రాజ్ నమ్మకం వ్యక్తం చేశారు. ట్రైలర్‌లో విలన్ పాత్ర ఇంటెన్స్‌గా, క్రూరంగా చూపబడింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సినిమాకు బలాన్నిచ్చాయి. కాల భైరవ సంగీతం, రామ మారుతి సినిమాటోగ్రఫీ అడవి అందాలను, కథలోని ఇంటెన్సిటీని అద్భుతంగా చూపించాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా, నేచురల్‌గా ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ‘వనవాసం’ వంటి పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
The "LION" roars, and #Mowgli steps back to welcome the Jungle King 🦁#Mowgli2025 GRAND RELEASE WORLDWIDE on 13th DEC 2025 ❤🔥
Premieres from DEC 12th 💥
A @SandeepRaaaj Cinema
A @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala @SakkshiM09 & @publicstar_bsk… pic.twitter.com/xSjflXnPbl
— People Media Factory (@peoplemediafcy) December 10, 2025

