Mallareddy villain offer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. తాజాగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన కాంమెంట్ తెగ వైరల్ అవుతున్నాయి. అతను ఎవరో కాదు ఎమ్మెల్యే మల్లారెడ్డి. తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో తనను విలన్ గా నటించమని దర్శకుడు హరీష్ శంకర్ తన దగ్గరకు వచ్చాడని, రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ కూడా ఇస్తానన్నాడని ఆయన చెప్పుకొచ్చారు. అయితే సినిమాలో మొదటి భాగం నేను హీరోను కొడతాను.. రెండో భాగం నన్ను హీరో కొడుతుంటాడు.. అలా చేయడం తనకు ఇష్టం లేదని అందుకే ఆ పాత్ర చేయనన్నానని తెలిపారు. దీనిని చూసిన మల్లారెడ్డి ఫ్యాన్స్ ఆ పాత్రను చేసి ఉంటే బాగుండును అని అనుకుంటున్నారు. మల్లారెడ్డి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ గా బాగా సూట్ అవుతాడు. ఇప్పటికే పాలు, పూలు అమ్మిన మల్లారెడ్డి సినిమాల్లో కూడా చేస్తే అదిరిపోయేదని మల్లారెడ్డి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read also-Kaleshwaram Project: కాళేశ్వరం కమిషన్ పిటిషన్లపై విచారణ వాయిదా..!
అయితే దీనిని చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంచి ప్రతినాయకుడు మిస్ అయ్యాడే అంటూ బాధ పడుతున్నారు. ఏది ఏమైనా మల్లారెడ్డి ఆ సినిమా చేసి ఉంటే సినిమా పరంగా రాజకీయ పరంగా మరింత మైలేజ్ వచ్చేది అంటున్నారు మల్లారెడ్డి అభిమానులు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తెలుగు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ సినిమాను హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. 2012లో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. 2016లో విడుదలైన తమిళ చిత్రం ‘తేరి’ ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని హరీశ్ శంకర్ పవన్ కల్యాణ్ స్టైల్‌కు తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, పార్థిబన్, కె.ఎస్. రవికుమార్, నవాబ్ షా వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Read also-Mohanlal: మోహన్‌లాల్‌కు భారత ఆర్మీ చీఫ్ ప్రశంసలు.. ఎందుకంటే?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా సాగుతోంది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్టైలిష్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. క్లైమాక్స్ సన్నివేశం భావోద్వేగ, యాక్షన్ నేపథ్యంలో ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో మాస్ ఎంటర్‌టైనర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా 2026లో విడుదల కానుందని సమాచారం. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఓజీ విడుదలై తెలుగులో 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం అందరి కళ్లూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీదే ఉన్నాయి. ఈ హిట్ కాంబో ఈ సారి ఏం చేస్తుందో చూడాలిమరి.
