Mirai movie makers: తేజ సజ్జా పుట్టిన రోజు సందర్భంగా ‘మిరాయ్’ సినిమా నుంచి వీడియోను విడుదల చేశారు నిర్మాతలు. అందులో తేజ సజ్జా యాక్షన్ సీన్స్ కోసం ఎంతెలా కష్టపడుతున్నాడో చూపించారు. ఎక్కడా డూపు లేకుండా తానే యాక్షన్ సీన్స్ మొత్తం చేస్తున్నారు. దీనిని చూసిన అభిమానులు తేజ సినిమా కోసం ఎంతెలా కష్టపడతాడో చూడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు సినిమా కోసం ఇంతిలా కష్టపడతాడు కనుకే హిట్ అవుతున్నాయని సమాధానం ఇస్తున్నారు.
Read also- Beauty Teaser: పేరుకే ‘బ్యూటీ’.. అంతా ఎమోషనల్.. ‘బ్యూటీ’ టీజర్ ఎలా ఉందంటే?
తేజ సజ్జ హీరోగా నటిస్తున్న “మిరాయ్”(Mirai movie makers) సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జ “సూపర్ యోధుడు”గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్‌లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, తేజ సజ్జ స్టైల్, మాస్ ఎంట్రీ కలిసి ప్రేక్షకుల్లో భారీ హైప్ సృష్టించాయి.
ఈ చిత్రంలోని తొలి పాట “వైబ్ ఉంది బేబీ” ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హిందీ హక్కులు తీసుకోవడం విశేషం. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 5, 2025న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం పోస్ట్-ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. యాక్షన్, విజువల్స్, సూపర్ హీరో థీమ్ కలిసి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
Read also-Kantara Chapter 1: ‘కాంతార చాప్తర్ 1’ థియేట్రికల్ హక్కులు ఎంతో తెలిస్తే షాక్..!
ఇంతకు ముందు నటించిన “హనుమాన్” సూపర్‌హీరో సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఒక తెలుగు సూపర్ హీరో సినిమా వంద కోట్లకు పైనే వసూలు చేసింది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందించారు. హీరోగా తేజ సజ్జ, హీరోయిన్‌గా అమృత అయ్యర్ నటించారు. కథ పూర్తిగా భారతీయ సంస్కృతి, పురాణాల నేపథ్యంతో సూపర్‌హీరో కాన్సెప్ట్‌ను కలిపి చూపించబడింది. సెట్‌యింగ్ చిన్న ఊరు అంజనాద్రిలో ఉంటుంది, అక్కడ జరిగే సంఘటనలు, హీరోకు లభించిన శక్తుల చుట్టూ కథ తిరుగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, హీరో క్యారెక్టర్ డిజైన్ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.