Chiranjeevi: ఎట్టకేలకు విశ్వంభర ఆలస్యం గురించి చిరంజీవి వీడియో చేశాడు. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విశ్వంభర ఆలస్యం గురించి చిరంజీవి స్పందన
విశ్వంభర ఆలస్యం గురించి చిరంజీవి స్పందనమెగాస్టార్ చిరంజీవి తన రాబోయే సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర గురించి అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు. ఈ చిత్రం ఆలస్యం కావడంపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, దీనికి ప్రధాన కారణం చిత్రం రెండో భాగం పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మీద ఆధారపడి ఉండటమేనని ఆయన తెలిపారు.
ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ ” హయ్ ఇలా మీ ముందుకు రావడం కారణం విశ్వంభర. చాలా మందికి డౌట్ ఉంది, ఈ చిత్రం ఎందుకు లేట్ అవుతుంది. ఆలస్యం అవుతుందని చాలా మందికి సందేహం ఉంది. ఎందుకంటే, ఈ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి బెస్ట్ క్వాలిటీతో మీ ముందు ఉంచాలి. మీకు అందివ్వాలన్నా దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం. ఎలాంటి విమర్శకులకు తావు ఇవ్వకుండా.. శ్రద్దా శక్తులతో తీసుకుంటున్న సముచితమైన సమయం ఇది. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఇదొక చందమామ కథలా సాగిపోయేనటువంటి అద్భుతమైన కథ.ముఖ్యంగా, చిన్న పిల్లలకు, పెద్ద వాళ్ళలో ఉండే చిన్న పిల్లలు ఉంటారుగా.. వాళ్ళని సైతం వినోదపరుస్తుంది. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మీతో పాటు నాకు కూడా సమాధానంగా కావాలి. UV క్రియోషన్స్ వాళ్ళు ఒక చిన్న గింప్స్ ను మన ముందుకు తీసుకురానున్నారు. అది నా పుట్టిన రోజు సందర్భంగా.. ఒక రోజు ముందుగా .. అంటే కొన్ని గంటల తర్వాత ఆగస్టు 21 సాయంత్రం 6 గంటలు 6 నిముషాలకు రానుంది. అంటే కొన్ని గంటల వ్యవధిలో మీ ముందుకు ఉంచుతున్నారు. అది మిమల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. రిలీజ్ డేట్ ఎప్పుడా.. అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు మీ కోసం ఇక్కడ సీక్రెట్ గా చెబుతా. పిల్లల ఇష్టమైన సీజన్లో 2026 సమ్మర్లో మీ ముందుకు వస్తాను అంటూ ” ఆ వీడియోలో చెప్పారు. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.