Meera Raj: స్టార్ హీరోయిన్ అయ్యే చూడచక్కని రూపం.. కుర్రాళ్ల గుండెలు దోచేసే వలపు సోయగం.. స్క్రీన్ మొత్తం తళుక్కుమంటూ చెలరేగిపోయే చలాకీదనం.. ఇవన్నీ కలగలిసిన హీరోయిన్ మీరా రాజ్ (Meera Raj) ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నటి మీరా రాజ్.. గ్లామర్ అండ్ యాక్టింగ్ ఫర్మార్మెన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాత్రలో లీనమయ్యే విధానం, భాష పట్ల చూపించే నిబద్ధత, కష్టపడే మనస్తత్వం.. ఇవన్నీ మీరాను స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలబెడుతున్నాయి. ఆమె నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘సన్ ఆఫ్’ (Son Of) ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుని, విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ స్పందనను రాబట్టుకుంటోంది. ఇందులో తను చేసిన పాత్రకు.. స్వయంగా మీరానే తెలుగులో డబ్బింగ్ చెప్పడం విశేషం. ఉత్తరాదికి చెందినా, స్వచ్ఛమైన తెలుగు ఉచ్చారణతో డైలాగులు చెప్పి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ‘భాష అంటే అభినయానికి ప్రాణం’ అనే భావనను ఆచరణలో చేసి చూపించింది మీరా రాజ్. అందుకే ఆమె పేరు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సౌండ్ సినీ ఇండస్ట్రీగా మారింది.
Also Read- Bigg Boss Grand Finale: ఈసారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మాములుగా ఉండదు.. ప్రోమో వచ్చేసింది!
శక్తినంతా పెట్టి పనిచేస్తున్నా
‘సన్ ఆఫ్’ సినిమా చేస్తుండగానే.. మీరా రాజ్‌కు వరుస ఆఫర్స్ వస్తుండటం చూస్తుంటే.. తన గ్లామర్‌తో ఈ భామ ఏ రేంజ్‌కు వెళుతుందో ఊహించవచ్చు. ప్రస్తుతం ఆమెకు దక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం విషయానికి వస్తే.. పాన్-ఇండియా చిత్రం ‘కాంచన 4’ (Kanchana 4). ఈ మూవీలో పూజా హెగ్డే, రాఘవ లారెన్స్, నోరా ఫతేహి వంటి స్టార్ నటీనటులతో కలిసి నటించడం మీరా రాజ్‌కు గొప్ప అవకాశమనే భావించాలి. ఈ మూవీ డైరెక్టర్ రాఘవ లారెన్స్‌పై మీరా రాజ్‌కు అపారమైన గౌరవం ఉంది. ‘‘నాపై నమ్మకం ఉంచి, చాలా మంచి పాత్రను ఇచ్చినందుకు లారెన్స్ మాస్టర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆయన నుంచి నాకు ఎప్పుడూ పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా శక్తినంతా పెట్టి పనిచేస్తున్నాను’’ అని మీరా భావోద్వేగంగా తెలిపింది. ఇక మరో విశేషం ఏమిటంటే.. ఇప్పటికే తెలుగు సినిమాకు తెలుగమ్మాయిలా చక్కని ఉచ్ఛారణతో డబ్బింగ్ చెప్పిన మీరా.. ఇప్పుడు ‘కాంచన 4’లోని తన పాత్రను మరింత సహజంగా మలచుకోవడానికి మీరా ప్రస్తుతం తమిళ భాషను కూడా నేర్చుకుంటోందట. పాత్ర కోసం కొత్త భాషను నేర్చుకోవడమే కాకుండా, సంస్కృతి, మేనరిజమ్స్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం నిజంగా ఆమె ప్రొఫెషనలిజానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.
Also Read- Pade Pade Song: సంగీత ప్రియులను కట్టి పడేస్తున్న ఆది సాయికుమార్ ‘శంబాల’ నుంచి పదే పదే సాంగ్..
సౌత్ భామనే అని అనిపించేలా
అందానికి అందం, అభినయం, క్రమశిక్షణ, కష్టపడే తత్వం.. ఈ నాలుగు లక్షణాల సమ్మేళనమే మీరా రాజ్ అని అప్పుడే ఆమెపై టాక్ కూడా మొదలైంది. చిన్న అవకాశాన్ని పెద్ద విజయంగా మలుచుకునే పట్టుదలతో ఉన్న మీరా రాజ్.. ముందు ముందు మరిన్ని చిత్రాలలో అవకాశం దక్కించుకుని, స్టార్ హీరోయిన్ అవుతుందని ఆమెను అంతా బ్లెస్ చేస్తున్నారు. సౌత్ సినిమాల్లోకి ఉత్తరాది అమ్మాయిగా వచ్చి, సౌత్ భామనే అని అనిపించేలా నటించగలగడం అంత సులువు కాదు. మీరా రాజ్ మాత్రం నటన పట్ల తన డెడికేషన్ చూపిస్తూ.. అది సాధ్యమని నిరూపిస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

