Mr Reddy Teaser: పెళ్లంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదు!
Mr Reddy Movie Still
ఎంటర్‌టైన్‌మెంట్

Mr Reddy Teaser: పెళ్లంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదు!

Mr Reddy Teaser: యదార్థ సంఘటనలతో టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోల్డ్ మ్యాన్ రాజా (టీఎన్ఆర్) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మిస్టర్ రెడ్డి’. వెంకట్ వోలాద్రి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో టీఎన్ఆర్‌తో పాటు మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక వంటి వారు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్ర టీజర్‌ని తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, పట్నం సునీతా రెడ్డి, నల్లగొండ గద్దర్ వంటి వారి సమక్షంలో మేకర్స్ విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. మిస్టర్ రెడ్డి టీం చాలా ఎనర్జీతో కనిపిస్తోంది. దర్శకుడు చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. హీరో, నిర్మాత టిఎన్ఆర్ చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నారు. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయాలని అన్నారు.

Also Read- Tamannaah-Vijay varma: తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్‌కి కారణమిదే?

టీజర్ విషయానికి వస్తే.. నేచురల్ లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించడం హైలెట్ అవుతోంది. ఈ టీజర్‌లోని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా నేచురల్ ఉండటమే కాకుండా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. చిన్నతనంలో విడిపోయిన ప్రేమ జంట.. పెద్దయ్యాక మళ్లీ ఎదురు పడితే, మళ్లీ ఆ ప్రేమ కోసం ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కాన్సెప్ట్‌ అనేది టీజర్ స్పష్టం చేస్తుంది. ‘‘మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదు.. జీవితాన్ని చివరి వరకు కలిసి పంచుకోవడం’’ అంటూ చెప్పే డైలాగ్, టీజర్‌లోని కొన్ని సన్నివేశాలను సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.

ఈ సందర్భంగా గోల్డ్ మ్యాన్ రాజా మాట్లాడుతూ .. ఈ టీజర్ విడుదలకు వచ్చిన ముఖ్య అతిథులందరికీ కృతజ్ఞతలు. మా టీజర్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అంతా కొత్తవాళ్లం చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. త్వరలోనే రిలీజ్‌కు తీసుకురానున్నాం. అంతా ఈ సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను అని తెలిపారు. దర్శకుడు వెంకట్ వోలాద్రి మాట్లాడుతూ.. ఒక యదార్థ సంఘటనతో, కొత్త వాళ్లమంతా కలిసి ఈ చిన్న ప్రయత్నం చేశాం. అందరూ చెప్పినట్లుగా కాకుండా.. నిజంగానే సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను మేం అంతా చాలా కష్టపడి చేశాం. మాలాంటి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. త్వరలోనే పాటలను విడుదల చేస్తామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు, చిత్ర బృందం ప్రసంగించారు.

Mr Reddy Movie Teaser Launch Event
Mr Reddy Movie Teaser Launch Event

ఇవి కూడా చదవండి:
Agent OTT: ఫైనల్లీ ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్.. ఎన్ని నెలల తర్వాత వస్తుందో తెలుసా?

Bigg Boss: పెళ్లి పీటలెక్కనున్న బిగ్‌బాస్ బ్యూటీ?

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క