Bollywood ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Bollywood: రాత్రికి రాత్రే అన్ని ఎలా మారిపోతున్నాయి?.. బాలీవుడ్ హీరో సంచలన కామెంట్స్

Bollywood: బాలీవుడ్‌ హీరో మనోజ్ బాజ్‌పేయీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీనియర్ నటుడు తన నటనతో లక్షల మంది హృదయాలను గెలుచుకున్నాడు, కానీ ఇప్పుడు తన వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ పీఆర్ టీమ్‌లు, ‘నేషనల్ క్రష్’ ట్యాగ్‌లపై మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
దీంతో, బాలీవుడ్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక రష్మిక మందన్నా ఫ్యాన్స్ అయితే ఈ కామెంట్స్‌పై ఫైర్ అవుతూ, మనోజ్ ఆమెను ఉద్దేశించే మాట్లాడాడని ఆరోపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, మనోజ్ బాజ్‌పే యీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ,

“ పియూశ్ మిశ్రా వంటి గొప్ప నటులు ఎన్నో ఏళ్ల శిక్షణ, కష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చా రు. కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్లను ఉత్తమ నటులంటూ పీఆర్ టీమ్‌లు హైప్ చేస్తున్నాయి. ఇలా చేస్తే పియూశ్‌ను అవమానించడమే కదాఫైర్ అయ్యారు. అసలు ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం పూర్తిగా మారిపోయింది. రాత్రికి రాత్రే మొత్తం మారిపోతున్నాయి. ఎంతలా అంటే బటన్ నొక్కినంత ఈజీగా..? ‘నేషనల్ క్రష్’, ‘ఉత్తమ నటుడు’ అంటూ ట్యాగ్‌లు ఇచ్చేసి మరి వైరల్ చేస్తున్నారు. వీళ్ళు మంచిగా నటించారనుకునే లోపు, పీఆర్ టీమ్‌లు వేరొకరిని పైకి తీసుకొస్తున్నాయి. ఈ పద్ధతి అస్సలు నచ్చలేదు. నాకు చాలా చిరాకు తెప్పిస్తోంది” అంటూ విసుక్కున్నాడు.

ఈ కామెంట్స్ వైరల్ కావడంతో రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మనోజ్ ఆమెను కావాలనే టార్గెట్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ వివాదం బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మనోజ్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించినవైనా, ఈ వివాదం ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి.

Just In

01

Delhi Blast: ఒక్కొక్కటిగా వెలుగులోకి నిజాలు.. ఇంటెలిజెన్స్ తాజా అనుమానం ఇదే

Jubilee Hills Bypoll: పోలింగ్ రోజూ పంపకాల జోరు?.. జూబ్లీహిల్స్‌లో ఎంత పంచారంటే?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బై పోలింగ్ లో హీట్ ట్రెండ్.. మాస్ లోని మెజార్టీ లంతా నవీన్ వైపే?

Delhi Blast: పేలుడుకు ముందు 3 రోజులపాటు అండర్‌గ్రౌండ్‌లోకి ఉమర్.. వెలుగులోకి సంచలన నిజాలు

Gadwal District: నిధులు లేక నిరీక్షణ రెండేళ్ల నుంచి రాని గ్రాంట్లు.. చెక్కులు పాస్ కాక పంచాయతీ కార్యదర్శుల అవస్థలు