దక్ష సినిమా రివ్యూ: దక్ష – ది డెడ్లీ కాన్స్‌పిరసీ (2025)
టైటిల్: దక్ష – ది డెడ్లీ కాన్స్‌పిరసీ
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 19, 2025
జానర్: అడ్వెంచర్, సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్
రన్‌టైమ్: 1 గంట 42 నిమిషాలు
రేటింగ్: UA
దర్శకుడు: వంశీ కృష్ణ మళ్ల
నటి నటులు: మోహన్ బాబు, లక్ష్మీ మంచు, సముద్రకని, చిత్ర శుక్ల, సిద్ధిక్
నిర్మాణం: మంచు ఎంటర్‌టైన్‌మెంట్
కథ సారాంశం
‘దక్ష – ది డెడ్లీ కాన్స్‌పిరసీ’ ఒక సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్, ఇందులో డాక్టర్ మిథిల (లక్ష్మీ మంచు) అనే శాస్త్రవేత్త అనేక టెర్మినల్ వ్యాధులను నయం చేయగల ప్లాంట్ ఆధారిత ఫార్ములాను కనుగొంటుంది. ఈ ఆవిష్కరణ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బలరామ్ వర్మ (సిద్ధిక్) లాభాలకు గండి కొడుతుంది. తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి బలరామ్ మిథిల హత్యను ప్లాన్ చేస్తాడు. ఈ కేసును ఛేదించేందుకు దక్ష (లక్ష్మీ మంచు) అనే పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. ఆమె బలరామ్ సామ్రాజ్యం వెనుక దాగిన చీకటి రహస్యాలను బయటపెడుతూ, వ్యక్తిగత , వృత్తిపరమైన పోరాటంలో నిమగ్నమవుతుంది.
నటన
లక్ష్మీ మంచు: దక్ష పాత్రలో బలమైన నటనను ప్రదర్శించింది. ఆమె తన పాత్రలోని ఎమోషనల్ డెప్త్, డిటర్మినేషన్‌ను బాగా పండించింది.
మోహన్ బాబు: డాక్టర్ విశ్వమిత్రగా మోహన్ బాబు తన పాత్రకు న్యాయం చేశాడు.
సముద్రకని : చలపతిగా సహాయక పాత్రలో మెప్పించారు, అయితే ఆయన పాత్రకు మరింత స్క్రీన్ స్పేస్ ఇచ్చి వుంటే బాగుండేది.
సిద్ధిక్ : విలన్‌గా బలరామ్ వర్మ పాత్రలో ఒక టిపికల్ కార్పొరేట్ దిగ్గజంగా కనిపిస్తారు. కానీ, కొన్ని సన్నివేశాల్లో ఓవర్-డ్రామాటిక్‌గా అనిపిస్తుంది.
చిత్ర శుక్ల : తన సహాయక పాత్రలో ఆకట్టుకుంది, కానీ ఆమె పాత్రకు లోతు తక్కువ.
సాంకేతిక అంశాలు
దర్శకత్వం: వంశీ కృష్ణ మళ్ల కథను ఆసక్తికరంగా తీసినా , క్లైమాక్స్‌లో సరైన విధంగా తియ్యకపోవడంతో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.
సంగీతం: సంగీతం సన్నివేశాలకు తగ్గట్టుగా ఉన్నా.. గుర్తుండిపోయే ట్యూన్స్ లేవు.
సినిమాటోగ్రఫీ: భుక్య శివ రాథోడ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఒక మంచి విజువల్స్ ను అందించాడు. ముఖ్యంగా, కొన్ని సూపర్‌న్యాచురల్ సన్నివేశాల్లో
ఎడిటింగ్: ఎడిటింగ్ కొన్ని చోట్ల మరింత టైట్‌గా ఉండాల్సింది, సెకాండాఫ్ లో కొన్ని సీన్స్ లాగ్ అయినట్టు అనిపిస్తాయి.
పాజిటివ్స్
బలమైన కాన్సెప్ట్.. ఫార్మాస్యూటికల్ మాఫియా, సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలగలిపిన కథ.
సినిమాలో లక్ష్మీ మంచు నటన ప్లస్ అనే చెప్పుకోవాలి. అలాగే స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్
సమకాలీన సమస్యలను తాకడం, ఎమోషనల్ డెప్త్.
నెగిటివ్స్
సెకాండాఫ్ లో సినిమా పేస్ తగ్గడం.
సంబంధం లేకుండా కొన్ని ఊహించిన ట్విస్టులు మైనస్ గా మారాయి. అలాగే క్లైమాక్స్ కూడా.
సహాయక పాత్రలకు తక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం కూడా మైనస్ గా మారింది.