k-ramp(image :X)
ఎంటర్‌టైన్మెంట్

K-Ramp trailer Date: ‘కె ర్యాంప్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. ఎంటర్‌టైన్మెంట్ లోడింగ్..

K-Ramp trailer Date: టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మరో సినిమాతో ఈ దీపావళికి సిద్ధమవుతున్నాడు. ‘కె-ర్యాంప్’ అనే ఈ రొమాంటిక్ కామెడీ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను అక్టోబర్ 11 తేదీన సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కుర్రకారుకు బాగా నచ్చేటట్లు రూపొందించారు. అయితే సినిమా టీం మాత్రం టీజర్ లో ఉన్నట్లుగా ఏం ఉండవని చెబుతోంది. ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Read also-Deepika Padukone: పని గంటలపై బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. అందుకేనా తప్పించారు..

ఈ చిత్రాన్ని జైన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నారు. అతని మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఫ్రెష్ స్టోరీ ఈ మూవీలో కనిపిస్తుందని అధికారికంగా ప్రకటించారు. కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్‌గా కనిపించనున్నారు. సాయికుమార్, మురళీధర్ గౌడ్ వంటి సీనియర్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో ఉన్నారు. నిర్మాణం హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే ప్రమోషన్స్ స్పీడ్‌గా మొదలయ్యాయి. సెప్టెంబర్ 19న విడుదలైన టీజర్ యూత్‌కి ‘కూల్’గా నచ్చింది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ టైమ్ కూడా లాక్ చేశారు, ఇది మరో ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేస్తోంది.

Read also-Kantara 1 collection: ‘కాంతార చాప్టర్ 1’ మొదటి వారం గ్రాస్ ఎంతో తెలిస్తే షాక్.. మాటల్లేవ్..

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.త్రివిక్రమ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన మూడో సింగిల్ ‘టిక్కల్ టిక్కల్’ లిరికల్ వీడియో యూత్‌కి సూపర్ హిట్ అయింది. టైటిల్ సాంగ్ కూడా ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. స్క్రిప్ట్ ప్రకారం 18 ముద్దు సీన్లు ఉండాలని ప్లాన్ చేశారు, కానీ ఫైనల్‌లో 16కి తగ్గించారట. దీనిని చూస్తుంటే మూవీలోని బోల్డ్ ఎలిమెంట్స్‌కి బాగా ఎలివేట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. హీరో కాంట్రవర్సీలు కూడా సినిమాకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Just In

01

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!