kiran-abbavaram( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం ఎమోషనల్ వీడియో.. నన్ను నమ్మండి..

Kiran Abbavaram: ‘కె ర్యాంప్’ విడుదల సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసిన సందర్భంగా ఒక వీడియేను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆయన ఏం అన్నారు అంటే.. ‘ సినిమాను హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. మార్నింగ్ షో పడిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా అందుకే ఇప్పుడు వచ్చాను. మీ ప్రదేశాల్లో సినిమాను చూసిన అందరూ మంచి పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. మా టీం అందరం చాలా సంతోషంగా ఉన్నాం. సినిమాలో దాదాపు అరగంట సేపు నవ్వుకునేలా ఉంది. ఏం చెప్పామో అదే ఇచ్చాము. కొందు ఫస్ట్ ఆఫ్ బాగుంది అంటే కొందరు సెకండాఫ్ బాగుంది అంటున్నారు ఏది ఏమైతేనే సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇంతకు ముందు ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాకు కూడా ఇదే విధమైన రెస్పాన్స్ వచ్చింది. మీరు నన్ను నమ్మండి. నేను మీరు పెట్టిన డబ్బులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఎంతో కొంత.’ అంటూ చెప్పుకొచ్చారు.

Read also-K Ramp review: కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ థియేటర్లను ఫుల్ చేసిందా.. ఎలా ఉందంటే?

ఒక సంపన్న కుటుండంలో ఉన్న సాయికుమార్ కు కొడుకుగా పుడతాడు కిరణ్ అబ్బవరం. అల్లరి చిల్లరగా తిరుగుతూ చదువు, బాధ్యదలకు దూరంగా ఉంటాడు. ఇదంతా చూస్తున్న కిరణ్ తండ్రి కుర్రాడిని సెట్ చేయాలని కేరళలోని ఒక కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. అక్కడ (కిరణ్ అబ్బవరం) కుమార్‌కు మెర్సీ (యుక్తి తరేజా) పరిచయమవుతుంది. హరోయిన్ ఒక అందమైన అమ్మాయ. కానీ మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. ఆమెతో ప్రేమలో పడిన కుమార్, ఆమె సమస్యలు (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ – PTSD) తెలుసుకుని ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాడు? తన చిల్లర లైఫ్ నుంచి బాధ్యతల వైపు మళ్లి, తండ్రి-కొడుకు బంధాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు? ఇది మెయిన్ ట్రాక్. కేరళ బ్యాక్‌డ్రాప్‌లో రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ మిక్స్ అయి సాగుతుంది. ఇంటర్వల్ లో ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ లో సినిమా మొత్తం పూర్తిగా మారిపోతుంది. ఎక్కువగా ఫన్, ఎమోషన్ మీదకు ఫోకస్ అవుతుంది.

Read also-Samantha: వ్యక్తిగత జీవితంపై సమంత వైరల్ కామెంట్స్.. ఆ ట్రోలింగ్ వల్లే..

ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించారు. అతని మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన ఫ్రెష్ స్టోరీ ఈ మూవీలో కనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తి తరేజా హీరోయిన్‌ లుగా కనిపించారు. సాయికుమార్, మురళీధర్ గౌడ్ వంటి సీనియర్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో ఉన్నారు. నిర్మాణం హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాపై కిరణ్ అబ్బవరం అభిమానులు ఆశించినట్లుగానే ఉంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది. సాయంత్రానికి ఈ సినిమా ఏవిధమైన టాక్ తో ముందుకు వెళ్తుదో చూడాలి.

Just In

01

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!