Kannappa Still
ఎంటర్‌టైన్మెంట్

Kannappa: ఆ 13 సన్నివేశాలు తొలగించాలి.. ‘కన్నప్ప’కు సెన్సార్ ప్రాబ్లమ్స్.. రిలీజ్ కష్టమేనా?

Kannappa: విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘కన్నప్ప’. పాన్ ఇండియా వైడ్‌గా జూన్ 27న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సెన్సార్ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. సినిమాలోని దాదాపు 13 సన్నివేశాలను తొలగించాలని రివిజన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ 13 సన్నివేశాలు తొలగిస్తేనే.. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని రీజనల్ ఆఫీసర్ ప్రతిపాదించినట్లుగా టాక్ నడుస్తుంది. దీంతో ‘కన్నప్ప’ విడుదల డౌట్స్‌లో పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘కన్నప్ప’ సినిమా.. ఈ సెన్సార్ ప్రాబ్లమ్స్‌తో మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read- Chiranjeevi: ఇకపై నాగ్ దారిలోనే నేను.. ధనుష్‌కి బెస్ట్ యాక్టర్ రాకపోతే..!

అసలు విషయంలోకి వస్తే.. సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను కించపరచడం, దేవి దేవతలను, పిలక గిలక పాత్రలతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, కోయ కులాన్ని కించపరిచేలాంటి దాదాపు 13 సన్నివేశాలు ఇందులో ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాల్సిందేనని 11మంది రివిజన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లోని 13 సన్నివేశాలను తొలగించని క్రమంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం జరగదని వారు సూచించినట్లుగా సమాచారం. మరి ఈ విషయంలో విష్ణు నిర్ణయం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. సినిమా విడుదలకేమో ఇంకా 5 రోజులు మాత్రమే సమయం ఉంది. చివరి నిమిషం వరకు ఉంచి హడావుడి చేసే కంటే, ముందే ఏదైనా నిర్ణయం తీసుకుంటే బెటర్ అనేలా ఈ విషయంలో మంచు ఫ్యామిలీ హీరోలకు సూచిస్తున్నారు వారి అభిమానులు. చూద్దాం ఏ జరుగుతుందో..

Also Read- Tollywood: ‘ముందు పెంచుకో.. ఆ తర్వాతే ఛాన్స్’.. స్టార్ హీరో కుమార్తెకు చేదు అనుభవం!

మరోవైపు ‘కన్నప్ప’ సినిమాపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ నెం.6236/2025 కేస్ పెండింగ్‌లో ఉంది. ప్రతివాదులుగా రీజనల్ ఆఫీసర్, సెన్సార్ బోర్డ్, సినిమా నిర్మాత మంచు మోహన్ బాబు, నటులు మంచు విష్ణు, బ్రహ్మానందం, సప్తగిరిలు ఈ కేసులో తమ వాదనలు వినిపించాల్సి ఉంది. ‘కన్నప్ప’ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరచడం, బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాన్ని కించపరచడం, దేవీ దేవతలను కించపరచడం సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక చెప్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరచలేదని చిత్ర టీమ్‌లోని బ్రాహ్మణ వ్యక్తితో ఇటీవల ఓ లేఖను కూడా విడుదల చేయించింది. అయినప్పటికీ బ్రాహ్మణ చైతన్య వేదిక వెనక్కి తగ్గలేదు. రీసెంట్‌గానే 11 మంది రివిజన్ కమిటీ సభ్యులతో కలిసి మంచు విష్ణు ఈ సినిమాను చూశారు.

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. ప్రీతి ముకుందన్‌ (Preity Mukhundhan) హీరోయిన్‌గా నటించింది. మోహన్‌బాబు (Mohan babu), మోహన్‌లాల్‌, ప్రభాస్‌ (Prabhas), అక్షయ్‌కుమార్‌, కాజల్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు