Kajal Aggarwal
ఎంటర్‌టైన్మెంట్

Kajal Aggarwal: ‘కన్నప్ప’ రిలీజ్ వేళ.. కాజల్ ఏంటీ పని?

Kajal Aggarwal: హీరోయిన్‌గా చేసినంత కాలం చేసి, టైమ్ రాగానే చక్కగా పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్. ఓ బాబుకి జన్మనిచ్చిన తర్వాత మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలోనూ ఆమెకు మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ పాత్రలు ఆమెకు లభించడం విశేషం. ప్రస్తుతం ఆమె ఓ కీలక పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం ఇంకొన్ని గంటల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల వేళ.. సేమ్ టైమ్‌లో కాజల్ అగర్వాల్‌పై బీభత్సమైన ట్రోలింగ్ నడుస్తుంది. కారణం ‘కన్నప్ప’ సినిమానే. తను ఏమాత్రం సంబంధం లేకపోయినా, ఆమె ఈ ట్రోలింగ్‌కు గురికావడం ఇప్పుడు విడ్డూరంగా మారింది. అసలింతకీ మ్యాటర్ ఏంటని అనుకుంటున్నారా? అయితే పెద్ద కథే ఉంది. పెద్దది అంటే మరీ పెద్దది కాదులే.. చిన్నదే. అదేంటంటే..

Also Read- Pawan Kalyan: పురందేశ్వరి తడబడ్డారా.. మనసులో మాట చెప్పారా?

‘కన్నప్ప’ సినిమాలో కాజల్ అగర్వాల్ దేవత పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించగా, ఆయన భార్య పార్వతీ దేవి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదాల మీద వాయిదాలు పడి, ఎట్టకేలకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇదే టైమ్‌లో కాజల్ అగర్వాల్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లింది. ఒకవైపు ఆమె దేవతగా నటించిన సినిమా విడుదలవుతుంటే, మరోవైపు ఆమె బీచ్‌లో కురచ దుస్తుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కొడుకు, భర్తతో పాటు ఈ వెకేషన్‌కు తన సోదరి ఫ్యామిలీ కూడా వెళ్లింది. సాగరతీరంలో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా కాజల్ షేర్ చేయడంతో.. ఇప్పుడామెపై పెద్ద కాంట్రవర్సీనే నడుస్తుంది.

Also Read- Kuberaa: ‘కన్నప్ప’ రిజల్ట్‌పైనే ‘కుబేర’ ఆశలు.. తమిళనాడులో మరీ ఘోరం!

కొన్ని గంటల్లో ఆమె దేవతగా నటించిన సినిమా విడుదల కాబోతుండగా.. సోషల్ మీడియాలో ఈ దారుణం ఏంటి? అని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బీచ్‌కు వెళ్లేది ఎంజాయ్ చేయడానికే. వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. కాకపోతే వెళ్లిన టైమే రాంగ్ అని కొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఆ సినిమా వాయిదాలు పడి ఇప్పుడు రిలీజ్ అవుతుంది. వాళ్లు ఈ వెకేషన్‌ని ఎప్పుడో ప్లాన్ చేసుకుని ఉంటారు. ఇందులో ఆమె మిస్టేక్ ఏమీ లేదు. కాకపోతే కొన్ని సెంటిమెంట్స్ అంటూ ఉంటాయి కదా. ఆమె సోషల్ మీడియాలో ఆ ఫొటోలు షేర్ చేయకుండా ఉంటే సరిపోయేది. ఆ ఫొటోలను చూపిస్తూ.. ఎవరికి కావాల్సిన విధంగా వారు కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. కాకపోతే ఈ ఫొటోల్లో మరీ ఘోరంగా అయితే కాజల్ లేదు. టు పీస్ బికినీలో కనిపించి ఉంటే మాత్రం పెద్ద రచ్చే అయ్యేది. ఏది ఏమైనా.. ‘కన్నప్ప’ విడుదల వేళ కాజల్ సెన్సేషన్‌గా మారిందనేది మాత్రం నిజం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్