Kaantha OTT: వెర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన ద్విభాషా చిత్రం ‘కాంత’ థియేట్రికల్ రన్‌ను ముగించుకుని ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. అద్భుతమైన పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం, డిసెంబర్ 12 (Kaantha OTT Release Date) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. ‘కాంత’ చిత్రం ప్రధానంగా 1950ల కాలంలో మద్రాసులో ఉన్న సినిమా స్వర్ణయుగం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. ఇది కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, అప్పటి సినిమా ప్రపంచానికి, దాని వెనుక ఉన్న కళాకారులకు మేకర్స్ అందించిన ఒక ట్రిబ్యూట్‌గా నిలుస్తుంది. గోల్డెన్ ఏజ్‌లో సినిమా మేకింగ్ తీరు, ప్రేమ, ఆశలు, నిరాశలు.. వంటి భావోద్వేగాల కలబోతగా ఈ సినిమా సాగుతుంది.
Also Read- Om Shanti Shanti Shantihi Teaser: తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బాల మూవీ టీజర్ ఎలా ఉందంటే.. పక్కా హిట్!
థియేటర్లలో స్పందన.. కలెక్షన్లలో నిరాశ
‘కాంత’ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విమర్శకుల నుంచి, ప్రేక్షకుల్లో కొంతమంది నుంచి పాజిటివ్ స్పందననే రాబట్టుకుంది. పీరియాడికల్ సెటప్, దుల్కర్ సల్మాన్ నటన, సాంకేతిక విలువలు ప్రశంసలు అందుకున్నాయి. అయితే, కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా వసూలు చేయలేకపోయింది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఈ చిత్రం ఓటీటీలో మాత్రం భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను పొందుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒక సినిమా నిర్మాణంలో.. గురుశిష్యులైన హీరో, దర్శకుడి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను దూరం చేసి, వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయాలని హీరోయిన్ చూస్తుంటుంది. ఈ క్రమంలో సినిమా బృందంలో ఓ వ్యక్తి హత్య చేయబడతాడు. ఆ హత్య చేసింది ఎవరు? హీరో, దర్శకుడికి మధ్య తగాదాలు ఏర్పడటానికి కారణాలేంటి? ఈ క్రమంలో సినిమా పూర్తయిందా? అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
Also Read- Jr NTR: చిరు బాటలో జూనియర్ ఎన్టీఆర్.. అనుమతి లేకుండా పేరు, ఫొటో వాడకూడదంటూ..!
భారీ భాగస్వామ్యం.. బహుభాషా విడుదల
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించగా, నటుడు సముద్రఖని (Samuthirakani) ఒక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా నిర్మాణంలో ఇద్దరు అగ్ర నిర్మాతలు భాగస్వామ్యులయ్యారు. దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు, ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. డిసెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేని ప్రేక్షకులు, పీరియాడికల్ సినిమాలను ఇష్టపడేవారు ఇప్పుడు ఓటీటీలో చూసి ఆస్వాదించడానికి అవకాశం లభించింది. చూద్దాం మరి.. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

