K Ramp producer: వారిపై ఫైర్ అయిన ‘కె ర్యాంప్’ నిర్మాత..
censor board (image:x)
ఎంటర్‌టైన్‌మెంట్

K Ramp producer: వారిపై తీవ్ర పదజాలంతో ఫైర్ అయిన ‘కె ర్యాంప్’ నిర్మాత.. ఎందుకంటే?

K Ramp producer: దీపావళి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘కె-ర్యాంప్’ సినిమా భారీ విజయం సాధించింది. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన ఈ చిత్రం, దర్శకుడు జైన్స్ నాని దర్శకత్వంలో రాజేష్ దండా, శివ బొమ్మక్కు నిర్మాణంలో వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెలిసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రంపేజ్ చేస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి సెంటర్లలో షోలు ఫుల్‌హౌస్‌లు రాబట్టుతున్నాయి. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. అయితే, ఈ ఈవెంట్‌లో నిర్మాత రాజేష్ దండా రివ్యూలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికాల ఆధారిత ఒక ప్రముఖ తెలుగు వెబ్‌సైట్ ఓనర్‌పై ఫైర్ చేశారు. ఎక్కడో లెక్కలు తెచ్చి ఈ సినిమాకు ఆపాదిస్తున్నావు. ఇక్కడ ఏం జరుగుతుందో చూశావు కదా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది అయినా సినిమాను తొక్కాలని చూస్తున్నావు. ఏం చెయ్యాలో అది చేస్తా వస్తున్నా అమెరికా వస్తున్నా కాసుకో అంటూ ఫైర్ అయ్యారు.

Read also-Sobhita Dhulipala: పండగ పూట నెటిజన్లతో చివాట్లు తింటున్న శోభిత.. ఎందుకంటే?

ఎంటర్‌టైన్‌మెంట్ రంపేజ్’కె-ర్యాంప్’ సినిమా దీపావళి సందర్భంగా విడుదలైంది. కిరణ్ అబ్బవరం మెయిన్ రోల్‌లో నటిస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా మెరిసినప్పటికీ, కామెడీ, ఎమోషన్ మిక్స్‌గా ఉన్న ఈ చిత్రం కుటుంబాలతో కలిసి చూడటానికి అనుకూలంగా ఉందని నిర్మాతలు చెప్పారు. చైతన్యా భరద్వాజ్ సంగీతం, మంచి విజువల్స్‌తో సినిమా మరింత ఆకర్షణీయంగా ఉంది. మొదటి రోజు రూ.4.5 కోట్లు సాధించిన ఈ చిత్రం, రెండో రోజు మరింత బెటర్ కలెక్షన్స్ రాబట్టింది. మొత్తం రాష్ట్రాల్లో మంచి ట్రెండ్ కొనసాగుతోంది. సక్సెస్ మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, “ఈ దీపావళి మళ్లీ బ్లాక్‌బస్టర్‌గా గడిచింది. ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. షోలు, స్క్రీన్లు, కలెక్షన్స్ అన్నీ పెరుగుతున్నాయి” అని అన్నారు. దర్శకుడు జైన్స్ నాని కూడా మొదటి చిత్రంగా ఈ విజయం సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Read also-Magadheera cameo viral: రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాలో కామియో రోల్ చేసిన రాజమౌళి ఫేవరెట్.. ఎవరంటే?

అమెరికాలో ఆధారిత ప్రముఖ తెలుగు వెబ్‌సైట్ పై స్పెషల్‌గా గట్టిగా ఫైర్ చేశారు. ఈ సైట్ 2.5/5 రేటింగ్ ఇచ్చి, సినిమాను ‘టైమ్‌పాస్’గా వర్గీకరించింది. దీనిపై రాజేష్ దండా, “వాళ్ల సినిమా ఫెయిల్ అయిందని మా సినిమాను కూడా డౌన్ చేయాలా? మా మీద బ్రతికే వాళ్లు, మా మీదే ఫోకస్ చేస్తున్నారు. ఉరి తియ్యాలి వాళ్లను!” అంటూ తీవ్ర భాషలో వ్యాఖ్యానించారు. ఈ వెబ్‌సైట్ ఓనర్‌పై ఆగ్రహం చూపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజేష్ దండా మాట్లాడుతూ, “హైదరాబాద్‌లో చాలా థియేటర్లలో షోలు ఫుల్ అవుతున్నాయి. విజయవాడ, ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్. షోవి వారీగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. రివ్యూల కంటే ప్రేక్షకుల ఆదరణే మా విజయాన్ని నిర్ధారిస్తోంది. మా టీమ్ అంతా ఆనందంగా ఉన్నాం” అని చెప్పారు. ఈ మాటలు ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణకు దారితీస్తున్నాయి. అన్నారు.

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!