Jr NTR: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఫిల్మ్ వార్ 2 ఆగస్టు 14, 2025 న పాన్-ఇండియా విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఇలాంటి హై-ఓల్టేజ్ యాక్షన్ మూవీలో నటించడంతో టాలీవుడ్‌లో హైప్ క్రియోట్ అయింది.
జూనియర్ ఎన్టీఆర్ తన 25 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ అయ్యారు. “25 సంవత్సరాల క్రితం ‘నిన్ను చూడాలని’ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. అప్పుడు నా వెంట అమ్మ, నాన్న తప్ప ఎవరూ లేరు. మొదటి అభిమాని ముజీబ్ నన్ను కలిసి నేను ‘నీ అభిమానిని’ అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభిమానులు నాతోనే ఉన్నారు. వారి కోసం కష్టపడుతూనే ఉంటాను” అని అన్నారు. “నందమూరి తారక రామారావు ఆశీస్సులు నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు ” అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పారు.
అంతే కాదు, ఆ ఈవెంట్ లో ” ఈ సారి ఒక కాలర్ కాదు, రెండు కాలర్లు ఎత్తి చెబుతున్నా.. సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పాడు. సినిమా గురించి మాట్లాడుతూ, “సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి. దయచేసి వాటిని బయటపెట్టకండి. డబుల్ కాలర్ ఎత్తాను, కుమ్మేద్దాం” అని అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ మాటలు కొన్ని వర్గాల వారికీ కోపం తెప్పించాయి. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
ప్రస్తుతం, ఎన్టీఆర్ బట్టతల ఫొటోను షేర్ చేస్తూ.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొందరు ఎన్టీఆర్ ఒరిజినల్ ఇదేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఇలాగే మా అన్న ఫోటోలు పెడితే .. ఇండస్ట్రీకి మొగుడై కూర్చొంటాడు జాగ్రత్త అంటూ తారక్ ఫ్యాన్స్ ట్రోలర్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు.
