Jani Master: కొన్ని నెలలక్రితం తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు సైతం వెళ్లి వచ్చిన టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కెరీర్ ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టేనంటూ జోరుగా ఊహాగానాలు వెలువడ్డాయి. సోషల్ మీడియా వేదికగా అయితే విస్తృత ప్రచారం జరిగింది. లైంగిక ఆరోపణల వ్యవహారం, కేసు అంశం ఆయన అవకాశాలపై ప్రభావం చూపుతుందా? అనే సందేహాలు కూడా కలిగాయి. ఇండస్ట్రీలో తిరిగి అంతత్వరగా అవకాశాలు పొందడం కష్టమనే టాక్ కూడా వినిపించింది. కానీ, రామ్ చరణ్ కథనాయుకుడిగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా టీమ్ వినాయక చవితి సందర్భంగా బుధవారం విడుదల చేసిన చిన్న వీడియో క్లిప్‌తో జానీ మాస్టర్ కెరీర్‌పై ఊహాగానాలకు చెక్ పెట్టినట్టు అయింది.
Read also-Fake Land Scam: ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి ప్లాట్ల అమ్మకాలు.. కోట్లు కొల్లగొట్టిన గ్యాంగ్?
పెద్ద మూవీ సాంగ్ షూటింగ్ టీమ్‌లో జానీ మాస్టర్ కూడా కనిపించారు. ‘పెద్ది’ లో ఓ సాంగ్‌ను ఆయన కంపోజ్ చేస్తున్నట్టు కన్ఫార్మ్ చేసినట్టు అయింది. మైసూర్‌లో రామ్ చరణ్‌తో ఒక గ్రాండ్ సాంగ్ షూట్ స్టార్ట్ చేశారు. ఈ పాటలో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో జానీ మాస్టర్ స్టెప్పులు వేయించబోతున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ సాంగ్ కచ్చితంగా ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఒకప్పుడు తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన శ్రేష్టి వర్మను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు జానీ మాస్టర్‌పై ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి మళ్లీ అవకాశం ఇవ్వడంపై సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. ఒక విధంగా జానీ మాస్టర్‌కు సాయం చేస్తున్నారంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అని అంటున్నారు. ఈ వివాదం జరుగుతున్న సమయంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కూడా రామ్ చరణ్ అవకాశం ఇచ్చారంటూ కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.
జానీ మాస్టర్ వివాదం తారస్థాయిలో ఉండగా ఆయన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన శ్రేష్ట వర్మకు సుకుమార్ అవకాశాలు ఇచ్చారు. దీంతో ఆమె వెనుక సుకుమార్ ఉన్నారంటూ తెగ ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగా సుకుమార్, అల్లు అర్జున్ అనేక సందర్భాల్లో శ్రేష్టి వర్మకు మద్ధతుగా ‘పుష్ప 2’ లో ‘సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ సాంగ్ కొరియోగ్రఫీ చేయడానికి అవకాశం కూడా ఇచ్చారు. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు అయిన బుచ్చిబాబు కూడా జానీ మాస్టర్‌కు అవకాశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో గురు శిష్యుల మధ్యలో వివాదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Read also-PV Sindhu: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సంచలనం
జానీ మాస్టర్ టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు. ఆయన డాన్స్ షో “ఢీ” ద్వారా గుర్తింపు సాధించి, అనేక హిట్ సినిమాల్లోని పాటలకు కొరియోగ్రఫీ అందించారు. అయితే, 2024 సెప్టెంబర్‌లో, శ్రేష్టి వర్మ.. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలు చేస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అక్టోబర్ 24, 2024న తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలు జానీ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, నవంబర్ 23, 2024న సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.