Jailer 2 AI Image
ఎంటర్‌టైన్మెంట్

Jailer 2: ఈ ఫ్రేమ్ ఎంత బాగుంది.. సినిమాలో ఇలా కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలే!

Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ (Jailer) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీని సృష్టించిందో ప్రత్యక్షంగా అందరూ చూశారు. రజనీకాంత్‌ని కించిత్ కూడా కష్టపడకుండా, కేవలం చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్, స్టైల్‌తోనే దర్శకుడు దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) సినిమాను రూపొందించారు. ఎమోషనల్‌గా ఆయన పాత్రని క్యారీ చేస్తూనే, ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వడంతో, ఆ సినిమా ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. మళ్లీ సూపర్ స్టార్ ఈజ్ బ్యాక్ అనేలా, ఆయన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఇచ్చింది.

Also Read- Natural Star Nani: నేను కరెక్ట్ అని ప్రూవ్ చేశారు.. పవన్ కళ్యాణ్‌కు థ్యాంక్స్!

ఇక ఈ సినిమా విషయంలో నెల్సన్ దిలీప్ కుమార్ చేసిన ప్రయోగాన్ని అభినందించకుండా ఉండలేం. ముఖ్యంగా స్టార్ హీరోస్ అయిన శివరాజ్ కుమార్, మోహన్‌లాల్‌ పాత్రలను ఆయన మలిచిన తీరు మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేలా చేశాయి. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తూ, నెల్సన్ కథ చెప్పిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ‘జైలర్’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌లో ఆయన మరింతగా ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Natasimham Balakrishna) ఈ సీక్వెల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

వాస్తవానికి ‘జైలర్’ సినిమాలో శివరాజ్ కుమార్ కనిపించిన పాత్రలో బాలయ్య అయితే బాగుండేదని అంతా అనుకున్నారు. ఆ విషయం నెల్సన్ హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా కూడా ఆయనని అడిగింది. అందుకేనేమో.. ఈసారి పక్కాగా ప్లాన్ చేసి కోలీవుడ్ రజనీకాంత్ సినిమాలో కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌ని మాత్రమే కాకుండా, టాలీవుడ్‌కి చెందిన బాలయ్యకు కూడా ఓ పాత్రని నెల్సన్ రెడీ చేశాడట. ప్రస్తుతం ‘జైలర్ 2’ షూట్‌లో బాలయ్య పాల్గొంటున్నట్లుగా వార్తలు కూడా బయటికి వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇది నిజమే అనేలా, ఈ నలుగురు స్టార్స్ ఉన్న పిక్ ఒకటి బాగా వైరల్ అవుతుంది.

Also Read-Mega Family: వామ్మో.. అవకాయ పచ్చడికి పూజలు! చిరు భార్య సురేఖ ఏం చేస్తుందో చూశారా!

ఓ నెటిజన్ ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, బాలయ్య, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ఉన్నట్లుగా ఏఐతో ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసి సోషల్ మాధ్యమాలలో వదిలారు. ఈ ఫొటో చూసిన వారంతా, ఈ ఫ్రేమ్ ఎంత బాగుంది. నిజంగా సినిమాలో ఈ నలుగురు లెజెండ్స్ ఇలా కనిపిస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలవడం కాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రజనీకాంత్ జైలర్‌గా, బాలయ్య పోలీసాఫీసర్‌గా, శివరాజ్ కుమార్ గ్యాంగ్‌స్టర్, మోహన్ లాల్ ఓజీగా ఇందులో కనిపిస్తారనేలా నెటిజన్లు ఈ ఫొటోకి కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ