Jabardasth Nukaraju: ఆసియాతో పెళ్లి జరగదు, జబర్దస్త్ నూకరాజు?
Jabardasth Nukaraju ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Jabardasth Nukaraju: ఆసియా, నేను ప్లాన్ చేసుకున్నా మా పెళ్లి జరగదు.. జబర్దస్త్ నూకరాజు

Jabardasth Nukaraju: జబర్దస్త్ కమెడియన్ నూకరాజు, పటాస్ ఆసియా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై వీరిద్దరూ ఎంత పాపులర్ అయ్యారో మనందరికీ తెలిసిందే. తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న జంటలలో వీరు కూడా ఒకరు. వీరిద్దరూ “పటాస్” షో ద్వారా ప్రేక్షకులకు బుల్లితెరకి పరిచయమయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్‌లో కూడా కలిసి స్కిట్స్‌లో నటించారు. వీరి మధ్య ఆన్-స్క్రీన్ లవ్ ట్రాక్‌తో పాటు, నిజ జీవితంలోనూ ప్రేమ సంబంధం ఉన్నట్లు చాలా మందికి సందేహం ఉంది. అయితే, తాజాగా వీరిద్దరూ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నూకరాజు పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

పెళ్లి గురించి అడగకపోతే మీ ఫ్యాన్స్ నన్ను కొడతారు అంటూ యాంకర్ అడగగా.. నూకరాజు షాకింగ్ ఆన్సర్ చెప్పాడు. పెళ్లి అవుతుంది. ఇద్దరికీ మంచి సంబంధాలు రావాలి కదా అన్నాడు. అప్పుడు వెంటనే ఆసియా వెంటనే ఆల్ ది బెస్ట్ అని చెబుతుంది. ఏది ప్లాన్ చేసుకోకూడదు. అలా జరిగిపోతాయి. మనం అనుకున్నవి జరగవచ్చు? జరగకపోవచ్చు? అందుకే ఏది ప్లాన్ చేసుకుని చేయకూడదు. జరగకపోతే బాధ పడతాము అంటూ తన మాటల్లో చెప్పుకొచ్చాడు. మేము అయితే ఎప్పుడూ ప్లాన్ చేసుకుని ఏ పని చేయలేదని చెప్పాడు.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం