THE-INDIAN-CINIMA( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Indian Movie: హాలీవుడ్‌ను మించిపోతున్న ఇండియన్ సినిమా.. ఆ సినిమాతో అది ఖాయం!

Indian Movie: ప్రపంచ సినిమా చరిత్రను ఇండియన్ సినిమా మార్చబోతుందా? అంటే అది ఎంతో దూరంలో లేదనే చెప్పాలి. హాలీవుడ్‌ స్థాయిని మించే సినిమాలు ఇండియన్ టెరిటరీలో రూపుదిద్దుకుంటున్నాయి. ప్రపంచ సినిమాపై భారతదేశ ముద్ర వెయ్యనున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా ‘ది రామాయణ’ సినిమాను చెప్పుకోవచ్చు. ఈ సినిమా ప్రకటించిన తర్వాత బడ్జెట్‌కు సంబంధించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. 700 కోట్లు, వెయ్యి కోట్లు, 1600 కోట్లతో ఈ సినిమా రూపొందుతోందని అనేక అంచనాలు ఉన్నాయి. అయితే ఈ అంచనాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈ సినిమా నిర్మాత నమిత్‌ మల్హోత్రా బడ్జెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని దానికి 4 వేల కోట్ల వరకూ ఖర్చుబెట్టబోతున్నామని నిర్మాత అన్నారు. ఇది ఇప్పటి వరకూ హాలీవుడ్‌లో నిర్మించిన అత్యధిక బడ్జెట్ సినిమా కంటే ఎక్కువ. ఇప్పటి వరకూ హాలీవుడ్‌ చరిత్రలో ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ వేకెన్స్’, ‘జూరాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్’. అనే సినిమాలు 3850 కోట్లతో నిర్మించారు. అదే హాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు. ‘ది రామాయణ’ ను ప్రకటించిన తర్వాత హాలీవుడ్ రికార్డులు అన్నీ బద్ధలయ్యాయి. దీంతో ప్రపంచ సినిమాను ఇండియన్ సినిమా శాసించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఇండియన్ సినిమా క్రిటిక్స్ కితాబిస్తున్నారు.

Read also- Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్ లోయలో పడి 8 మంది మృతి

ఓ ఇంటర్వ్యూలో ‘ది రామాయణ’ సినిమా గురించి నిర్మాత బాలీవుడ్ బడా నిర్మాత నమిత్‌ మల్హోత్రా ఇలా చెప్పుకొచ్చారు. ‘‘ది రామాయణ’ సినిమాతో ప్రపంచ సినిమా చరిత్రను తిరగ రాస్తున్నాము. హాలీవుడ్ లో భారతీయ సినిమాను అవమానించడం చాలా బాధ కలిగించింది. అందుకే ఈ ప్రాజెక్ట్ ప్రకటించాను. ప్రపంచంలో ఎన్ని కథలు వచ్చినా రామాయణానికి సాటి రావు, రాలేవు. దీంతో ప్రపంచం భారతీయ సినిమావైపు చూస్తుంది.’ అని అన్నారు. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi), రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్‌ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే మండోదరి పాత్రకు కాజల్ అగర్వాల్‌ను సెలక్ట్ చేశారు. మొదటి పార్ట్‌ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా కన్నడ స్టార్ యష్ వ్యవహరించనున్నారు.

Read also- Genelia: రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ.. ఇప్పుడున్న పొజిషన్ చూస్తుంటేనా?

ఇదిలా ఉండగా మరో రెండు సినిమాలు ’ది రామాయణ’ బడ్జెట్ తర్వాత అదే స్థాయిలో రూపుదిద్దకోబోతున్నాయి. ఒకటి దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబో ‘SSMB29’ అయితే, మరోటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న ‘AA22A6’. ఈ రెండు సినిమాలు వరుసగా 1000 కోట్లు, 900 కోట్లతో తెరకెక్కనున్నాయి. ‘SSMB29’ గురించి పూర్తి సమాచారం లేకపోయినా.. ‘AA22A6’ అయితే అయిదుగురు హీరోయిన్లు ఉన్నారని టాక్. ఇప్పటికే హీరోయిన్‌గా దీపిక పదుకొణె పేరును ప్రకటించారు. మరో ఇద్దరు హీరోయిన్లుగా భాగ్యశ్రీ బోర్సే, మృణాల్‌ ఠాకూర్‌ పేర్లను పరిశీలిస్తోంది యూనిట్‌. రష్మిక మందన్నతో చర్చలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. ‘ది రామాయణ’ తర్వాత బడ్జెట్ విషయంలో ‘SSMB29’, ‘AA22A6’ ఉండగా అందులో ఇద్దరు తెలుగు హీరోలు మహేష్, అల్లు అర్జున్ ఉండటం వారి అభిమానుల్లో జోష్ నింపుతుంది. వీటన్నిటినీ చూస్తుంటే రానున్న రోజుల్లో ఇండియన్ సినిమా హాలీవుడ్ ను శాసిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు