pawan kalyan ( image source : X)
ఎంటర్‌టైన్మెంట్

HHVM: ‘వీరమల్లు’ విడుదల వేళ అభినందనల వెల్లువ

HHVM: ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న విడుదల కాబోతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా విడుదల అయ్యే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. వానను సైతం లెక్కచేయకుండా పవన్ అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంతో మంది పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. కన్నడ, తెలుగు ఫ్యా్న్స్ సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం పవన్ పై ఉన్న అభిమానాన్ని ట్విటర్ ద్వారా తెలుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read also- Prabhas: బాహుబ‌లి పాత్ర కోసం.. ప్ర‌భాస్ రోజుకి అన్ని గుడ్లు తీసుకున్నాడా.. డైట్ లిస్ట్ చూస్తే మతి పోవాల్సిందే!

హరి హర వీరమల్లు సినిమా విడుదల వేళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖుల నుంచి మూవీ టీంకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి నారా లోకేశ్.. పవర్ స్టార్ అభిమానుల్లాగే తాను కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నానన్నారు. సాయి ధరమ్ తేజ్.. పవర్ స్టార్ పవర్ ఫుల్ స్టోమ్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్.. పవన్ కేరీర్‌లో వీరమల్లు సినిమా మైలు రాయి అవుతుందన్నారు. సంగీత దర్శకుడు థమన్.. చరిత్ర రాయడానికి ఈ సినిమా సిద్ధంగా ఉన్నదన్నారు. నాగ బాబు కొణెదల.. ధర్మం కోసం జరిగే యుద్ధం ఎలా ఉంటుందో థియేటర్లలో చూడాలన్నారు. డైరెక్టర్ బాబి.. బాక్సాఫీసును రూల్ చేసే సత్తా ఈ సినిమాకు ఉందన్నారు. యాక్టర్ శ్రీవిష్ణు.. పవన్ అభిమానులకు జూలై 24 పండగ రోజన్నారు. యాక్టర్ శివాజీ.. హరి హర వీరమల్లు టీం అందరికీ అభినందనలు తెలిపారు. డైరెక్టర్ మారుతి.. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ అభినందనలు తెలిపారు.

Read also- Sub-inspector Stolen 2 cr: బాధితుల సొమ్ముతో లేచిపోయిన పోలీసు జంట.. రూ.2 కోట్లతో గోవా, మనాలీలో షికార్లు.. చివరికి!

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను ప్రారంభించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు ఈ సనిమాను టేక్ ఓవర్ తీసుకున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బేనర్ పై ఏఎం రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మెఘల్ చక్రవర్తి ఔరంగ జేబు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచారం చిత్రాలు చూస్తుంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఈ సినిమా బిగెస్ట్ హిట్ అవుతుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ