pori-setupathi( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Purisethupathi music: పూరి, సేతుపతి సినిమాకు సంగీత దర్శకుడు సెట్.. ఎవరంటే?

Purisethupathi music: పూరి జగన్నాధ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పూరిసేతుపతి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ‘యానిమల్’ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్థన్ రామేశ్వరన్ ఫిక్స్ అయ్యారు. హర్షవర్థన్ రమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు నిర్మాతలు. ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న హర్షవర్థన్ పూరి సినిమాకు చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే సరైన హిట్ కోసం చూస్తున్న పూరి ఈ కాంబోతో మరో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. మూవీ టీం పరంగా చూస్తే స్టార్ పవర్ తో నిండి ఉంది. అందులో ఈ డైనమిక్ సంగీత దర్శకుడు కూడా వచ్చి చేరడంతో ఈ సినిమాకు మరింత ఎసెర్ట్ కానుంది. దీనిని చూసిన అభిమానులు ఈ సారి పూరికి హిట్ ఖాయం అంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హర్షవర్ధన్ తెలుగు లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Read also-GHMC: రూ.1438 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్.. గతేడాదితో పోల్చితే రూ.103 కోట్లు అధికం

తెలుగు సినిమా దిగ్గజం పూరీ జగన్నాథ్ మరోసారి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌తో రానున్నాడు. ఈ సారి అతని దర్శకత్వంలో తమిళ సూపర్‌స్టార్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. టాబు, సంయుక్త మేనన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ అన్‌టైటిల్డ్ మూవీని, తాత్కాలికంగా ‘పూరీసేతుపతి’ అని పిలుస్తున్నారు. పలు లొకేషన్ లలో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇది ఒక న్యూ-ఏజ్ సోషల్ డ్రామా ఉండనుందని సమాచారం. దీనిని ‘రా అండ్ రియల్’ సినిమాటిక్ జర్నీగా వర్ణించబడుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రం, చర్మీ కౌర్ ప్రెజెంటేషన్‌లో జేబీ మోషన్ ఆర్ట్స్‌తో కలిసి రూపొందుతోంది. ఈ సినిమా ఎమోషనల్ డెప్త్‌తో కూడిన కథగా ఉంటుందని సమాచారం. పూరీ ఈ సినిమాతో హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read also-Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌లో ప్రచార సామాగ్రి తొలగింపు.. సభలు, సమావేశాలకు పర్మిషన్ కావాల్సిందే!

తెలుగు సినిమా పరిశ్రమలో ‘పోకిరి’తో మాస్టర్‌ మైండ్‌గా పేరుపొందిన పూరీ జగన్నాథ్, ఒక మల్టీ-టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్‌రైటర్, ఒక్కోసారి యాక్టర్‌గా కూడా కనిపించే ఈయన, తన యూనిక్ స్టైల్‌తో పాన్-ఇండియా లెవెల్‌లో గుర్తింపు పొందారు. 2000లలో తెలుగు సినిమాను షేక్ చేసిన ఈయన, ఇప్పటికీ కొత్త ప్రాజెక్టులతో ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేస్తున్నారు. కన్నడలో పూనీత్ రాజ్‌కుమార్‌ను ‘అప్పు’ (2002)తో లాంచ్ చేశారు. యాక్టింగ్‌లో క్యామియోలు.. ‘బిజినెస్‌మ్యాన్’లో టాక్సీ డ్రైవర్, ‘టెంపర్’లో బైకర్, ‘గాడ్‌ఫాదర్’ (2022)లో గోవర్ధన్. ఫైట్ మాస్టర్స్‌తో (విజయన్, అలాన్ అమిన్) క్లోజ్ వర్కింగ్ ఫేమస్. అయితే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదల అయ్యే టీజర్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?