Guess The Actress: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 13 జనవరి 2025 నుండి 26 ఫిబ్రవరి వరకు మహా కుంభమేళా జరగనుంది. ఈ పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ప్రయాగ్‌రాజ్ వెళ్లి పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖులెందరో ఈ మహా కుంభమేళాలో ప్రత్యక్షమయ్యారు. ఇది 144 ఏళ్ళకు ఒకసారి జరిగే, ప్రపంచంలోనే అతి పెద్ద కుంభమేళా కావడంతో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. అందుకే చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ పుణ్యస్నానం ఆచరించేందుకు పయనమవుతున్నారు. ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించినవారు వారి జన్మధన్యమైనట్లుగా స్పందిస్తున్నారు. ఇప్పుడీ నటి కూడా అలాగే తన జన్మ ధన్యమైనట్లుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇంతకీ మహా కుంభమేళాలో మహా పవిత్ర స్నానాన్ని ఆచరిస్తున్న ఈ నటి ఎవరో కనిపెట్టారా?
ఈ నటి పేరు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది. ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రజలను టార్గెట్ చేస్తూ ఈమె చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. అంతేనా, ఈ వ్యాఖ్యలపై ఆమె జైలుకి సైతం వెళ్లివచ్చింది. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన ఈ నటి.. ఆ మాటలకు సారీ కూడా చెప్పింది. ‘‘హర్ హర్ మహాదేవ్! జై గంగే! ఇది నిజంగా నా జీవితంలో మరిచిపోలేని అనుభవం. నా జన్మ ధన్యమైంది’’ అంటూ పుణ్యస్నానమాచరిస్తున్న ఈ నటి షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పోనీలే, ఇలా అయినా నీ పాపాలు తొలగిపోతాయ్. నీలాంటి వాళ్లకి ఇలాంటి స్నానాలు అవసరం అంటూ నెటిజన్లు సైతం రియాక్ట్ అవుతున్నారంటే.. ఈ నటి ఎంతగా ఫేమస్సో అర్థం చేసుకోవచ్చు.
ఏంటి? ఇంకా ఈ నటి ఎవరో అర్థం కాలేదా? తెలుగులో ఒకప్పుడు చాలా సినిమాలలో నటించింది. ఓ భక్తి ప్రధాన చిత్రంలో కీలక పాత్రలో నటించి, అందరి మెప్పు అందుకుంది. సినిమాలనే కాదు, సీరియల్స్‌తోనూ ఈ నటి అందరికీ పరిచయమే. ఈ నటి ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించి, ఆదరణను చూరగొంది. ఇక ఇన్ని హింట్స్ ఇచ్చినా కూడా ఈ నటి ఎవరో తెలియలేదంటే.. మీకు సినిమా నాలెడ్జ్ పూర్తిగా లేనట్లే. ఈ నటి ఎవరో కాదు, కింది ఇన్‌స్టా లింక్ చూసేయండి.. ఈజీగా తెలిసిపోతుంది. ఇన్‌స్టాలో ఈ భామను చూసిన వారంతా.. అర్రె, ఈమె మాకెందుకు తెలియదు? అని అనుకుంటున్నారు కదా..