Good Bad Ugly Movie Poster
ఎంటర్‌టైన్మెంట్

Good Bad Ugly Teaser: ఇది కదా.. అజిత్ ఫ్యాన్స్‌కు కావాల్సింది

Good Bad Ugly Teaser: కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి తప్పితే.. స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి. కాసుల వర్షం కురిపించలేకపోతున్నాయి. అజిత్ చేయడానికి వరుసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, సరైన కంటెంట్ లేకపోవడంతో సినిమాలు వచ్చినదారిన వచ్చినట్లే వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం అజిత్ పని అయిపోయిందనే విధంగా కూడా వార్తలు మొదలయ్యాయి. మరి ఈ వార్తలు ఆయన వరకు వెళ్లాయేమో తెలియదు కానీ, ఈసారి మాత్రం కంటెంట్‌తో పాటు ఫ్యాన్స్‌కి కావాల్సిన అన్ని అంశాలున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడనే ఫీల్‌ని ఇస్తుంది ఆయన తాజా చిత్ర టీజర్. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Senior Heroine: సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్

పాన్-ఇండియా నిర్మాణ సంస్థ‌గా పేరొందిన మైత్రి మూవీ మేకర్స్, కోలీవుడ్ ఐకాన్ అజిత్ కుమార్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఈ చిత్ర తమిళ టీజర్ శనివారం విడుదలై 30 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రాబట్టి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్ చూసిన వారంతా తెలుగు టీజర్ ఎప్పుడు అనేలా వేచి చూడటం మొదలెట్టారు. అలా వేచి చూసే వారిని ఎక్కువ సమయం వెయిట్ చేయించకుండా, ఒక్కరోజు గ్యాప్‌లోనే అంటే ఆదివారమే ఈ చిత్ర తెలుగు టీజర్‌ని మేకర్స్ వదిలారు. ఈ టీజర్ ఎలా ఉందంటే..

ఇది కదా కావాల్సింది

స్టార్ ఐకాన్ అజిత్‌ను నెవర్ బిఫోర్ పాత్రలో అద్భుతంగా ప్రజెంట్ చేసిందీ టీజర్. కొన్నాళ్లుగా ఫ్యాన్స్ మిస్ అవుతున్న అంశాలన్నింటినీ కవర్ చేస్తూ, అజిత్ ‘రెడ్ డ్రాగన్’ డెడ్లీ, వైలెన్స్ వరల్డ్‌ని పరిచయం చేసింది. ‘నువ్వు ఎంత మంచివాడివైనా, ప్రపంచం నిన్ను చెడుగా మార్చేస్తుంది’ ఈ డైలాగ్‌తో సినిమాలోని అజిత్ పాత్రని నెరేట్ చేస్తుంది. అజిత్ తన నిజాయితీతో ఎంత పోరాడినా, అతని చుట్టూ ఉన్న శక్తులు అతన్ని చీకటి, ప్రమాదకరమైన ప్రపంచంలోకి నెట్టివేస్తాయని తెలియజేస్తుంది. అద్భుతమైన విజువల్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అజిత్ అభిమానులు కోరుకున్న విధంగా టీజర్‌ని కట్ చేసి, సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు మేకర్స్. జీవీ ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ హైలెట అనేలా ఉన్నాయి. అజిత్ సరసన త్రిషా కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ప్రభు వంటివారు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఏప్రిల్ 10న ఈ వేసవికి ఈ సినిమా విడుదల కానుంది. కచ్చితంగా ఈ సినిమా అజిత్‌కు బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని, ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:
Anasuya: మరోసారి అనసూయకు విరాట్ కర్ణ సినిమాలో ఛాన్స్

Suzhal- The Vortex Season 2: ఓటీటీలోకి వచ్చేసిన క్షణం చూపు పక్కకి తిప్పుకోనివ్వని సస్పెన్స్ థ్రిల్లర్‌ సిరీస్

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ